టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ...  న్యూ జెర్సీలో మెరిసిపోతున్నారు. వెస్టిండీస్ తో టీం ఇండియా టెస్ట్ మ్యాచ్ కోసం తలపడనున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రత్యేకంగా తయారు చేసిన న్యూజెర్సీని ఇండియన్ క్రికెటర్లు ధరించారు.  టెస్టు మ్యాచుల్లో క్రికెటర్లు తెలుగు రంగు జెర్సీని ధరించనున్న విషయం తెలిసిందే. 

గురువారం నుంచి ప్రారంభం కానున్నఈ టెస్ట్ సిరీస్  వెస్టిండీస్ లోని అంటిగా వేదికగా జరగనుంది. ఈ నేపథ్యంలోనే తమ పేర్లు, నెంబర్లతో కూడిన జెర్సీలను ఇండియన్ క్రికెటర్లు ధరించారు. ఆ ఫోటోలను తమ సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. కాగా... ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. టీం ఇండియా అధికారిక ఖాతాలో కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ అజ్యింక రహానే, యంగ్ క్రికెటర్ రిషబ్ పంత్ ఫోటోలను షేర్ చేశారు. 

ఇప్పటికే వెస్టిండస్ తో జరిగిన టీ20 ఇంటర్నేషనల్ సిరీస్, వన్డే ఇంటర్నేషనల్ సిరీస్ లను టీం ఇండియా కైవసం చేసుకుంది. రెండు సిరీస్ లోనూ టీం ఇండియా క్లీన్ స్వీప్ చేసింది. ఇప్పుడు టెస్ట్ సిరీస్ పై కన్నేసింది. మరి ఈ సిరీస్ లో విజయం ఎవరికి దక్కుతుందో చూడాలి.