Asianet News TeluguAsianet News Telugu

నన్ను పూర్తిగా మార్చేశావ్.. కోహ్లీ ఎమోషనల్ ట్వీట్, వైరల్

బుధవారం కోహ్లి దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ‘రాజీవ్‌ ఖేల్‌రత్న’ అవార్డ్‌ అందుకున్న సంగతి తెలిసిందే. 

Virat Kohli Pens a Love Note for Anushka Sharma After Khel Ratna Win. Read Here
Author
Hyderabad, First Published Sep 27, 2018, 12:10 PM IST

టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. మరోసారి తన భార్య, బాలీవుడ్ నటి అనుష్క శర్మపై ఉన్న ప్రేమను చాటుకున్నారు. బుధవారం కోహ్లి దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ‘రాజీవ్‌ ఖేల్‌రత్న’ అవార్డ్‌ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా  కోహ్లి తన ఇన్‌స్టాగ్రామ్‌లో, అనుష్క ఫోటోను షేర్‌ చేస్తూ ‘అడ్డంకులను ఎదుర్కొంటూ.. మంచి పనులు చేసుకుంటూ ముందుకు నడిచేలా నిరంతరం నన్ను ప్రోత్సాహించే వ్యక్తి.. నిజమైన ప్రేమలోని శక్తిని తెలియజేసి.. నన్ను పూర్తిగా మార్చిన వ్యక్తి.. నా బలం.. నా సోల్‌మెట్‌’ అంటూ అనుష్క శర్మ గురించి ట్వీట్‌ చేశారు.

 

కాగా.. విరాట్ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. విరాట్, అనుష్కలు గతేడాది ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. 
 

Follow Us:
Download App:
  • android
  • ios