తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో విరాట్ గురించి చెప్పాడీ ‘మిస్టర్ 360’. ‘మేమంతా బాగా కష్టపడుతున్నాం. ఈసారి మంచి ప్రదర్శన ఇవ్వాలని బాగా శ్రమిస్తున్నాం. దీనంతటికి కారణం విరాట్ కోహ్లీయే. అన్నింట్లో ముందు ఉంటూ జట్టును నడిపిస్తున్నాడు కోహ్లీ. నాయకుడే ముందుండి నడిపిస్తుంటే, అతని బాటలో నడవడం జట్టుకు చాలా ఈజీ’ అన్నాడు ఏబీ డివిల్లియర్స్.

ఆసీస్ ప్లేయర్లు ఆరోన్ ఫించ్, ఆడమ్ జంపాలను కొనుగోలు చేసిన బెంగళూరు, ఈసారి కచ్ఛితంగా టైటిల్ గెలవాలనే గట్టి పట్టుదలతో ఉంది. మూడు సార్లు ఫైనల్ చేరినా, టైటిల్ గెలవలేకపోయిన బెంగళూరు బెంగ ఈసారి అయినా తీరుతుందో లేదో చూడాలి.