క్రికెట్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వరల్డ్ కప్ 2019 సమరం మొదలైంది. ఈ సమరంలో భాగంగా ఈ రోజు ఆట ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో... బుధవారం అన్ని జట్లతో ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

దీనిలో భాగంగా పదిజట్ల కెప్టెన్లకు మరో అరుదైన అవకాశం దక్కింది. ఈ వరల్డ్ కప్ ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్ని జట్ల కెప్టెన్లకు క్వీన్ ఎలిజబెత్ ని కలిసే అవకాశం లభించింది. బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో క్వీన్‌ ఎలిజబెత్‌ను పది జట్ల కెప్టెన్లు మర్యాదపూర్వకంగా కలిశారు. వారందరికీ క్వీన్‌ ‘బెస్ట్‌ విషెస్‌’ చెప్పారు. ప్రిన్స్‌ హ్యారీ కూడా ఇందులో పాల్గొన్నాడు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. 

 మరోవైపు మేడమ్‌ టుస్సాడ్‌ మ్యూజియం నిర్వాహకులు భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి మైనపు బొమ్మను లార్డ్స్‌ మైదానంలో ఆవిష్కరించారు. టోర్నీ సాగినన్ని రోజులు ఈ విగ్రహం టుస్సాడ్‌ మ్యూజియంలో ఉంటుంది.