టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ఐపీఎల్ లో ఆర్సీబీ జట్టుకి ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ జట్టు ఇప్పటి వరకు 8 మ్యాచ్ లు ఆడగా.. అందులో కేవలం ఒక్క మ్యాచ్ మాత్రం విజయం సాధించింది. విజయ, పరాజయాల విషయాన్ని పక్కన పెడితే.. తాజాగా కోహ్లీ.. తమ ఆర్సీబీ జట్టు సభ్యులకు స్పెషల్ ట్రీట్ ఇచ్చాడు.

తన భార్య, బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మతో కలిసి ఆర్సీబీ జట్టు సభ్యులకు మంచి విందు ఇచ్చారు. ముంబయిలోని తమ నివాసానికి జట్టు సభ్యులు అందరినీ ఆహ్వానించి చక్కని విందు అందించారు. ఆ సమయంలో కోహ్లీ బ్లాక్ అండ్ బ్లాక్ డ్రస్ ధరించగా.. అనుష్క శర్మ.. వైట్ అండ్ బ్లూ కాంబినేషన్ డ్రస్ వేసుకున్నారు.

ఈ విందులో యజ్వేంద్ర చాహల్, హిమ్మత్ సింగ్, దేవ్ పడిక్కల్ లు పాల్గొని ఆ సమయంలో విరుష్క జంటతో దిగిన ఫోటోలను తమ సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. ‘‘ అద్భుతమైన డిన్నర్ అందించినందుకు చాలా థ్యాంక్స్’’ అంటూ చాహల్ ఫోటో కింద క్యాప్షన్ కూడా జత చేశాడు. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Thank you for the wonderful dinner last night @virat.kohli @anushkasharma #goodtimes

A post shared by Yuzvendra Chahal (@yuzi_chahal23) on Apr 16, 2019 at 10:15pm PDT