నెట్టింట వైరల్ గా మారిన విరుష్క లవ్లీ ఫోటోస్

Virat Kohli, Anushka Sharma Pack On The PDA In Their Latest Twitter Post
Highlights

 అంతేకాదు.. ఆ ఫోటోలను ట్విట్టర్ ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు.. తాజాగా.. కోహ్లీ వీరిద్దరికి సంబంధించిన ఓ ఫోటోని షేర్ చేయగా.. అది వైరల్ అయ్యింది.

టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మలు ఏది చేసినా సంచలనమే. గతేడాది డిసెంబర్ లో వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. ఇద్దరూ తమ తమ ప్రొఫిషన్స్ కి ఇంపార్టెన్స్ ఇస్తూ.. ఖాళీ సమయంలో ఒకరితో మరొకరు సమయాన్ని కేటాయిస్తూ ఆనందంగా గడుపుతున్నారు.

 

ప్రస్తుతం కోహ్లీ ఇంగ్లాండ్ పర్యటనలో ఉండగా.. అనుష్క కూడా అక్కడికి వెళ్లింది. దీంతో.. విరిద్దరూ ఖాళీ సమయంలో ఇంగ్లాండ్ వీధుల్లో పర్యటిస్తూ, షాపింగ్ చేస్తూ సందడి చేస్తున్నారు. అంతేకాదు.. ఆ ఫోటోలను ట్విట్టర్ ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు.. తాజాగా.. కోహ్లీ వీరిద్దరికి సంబంధించిన ఓ ఫోటోని షేర్ చేయగా.. అది వైరల్ అయ్యింది.

 

ఆ ఫోటోలో విరాట్ ని అనుష్క.. ప్రేమగా హత్తుకుంది. అంతేకాదు ఇద్దరూ చాలా స్టైలిష్ గా కూడా కనపడుతున్నారు. రెండు రోజుల క్రితం అనుష్క కూడా వీరిద్దరి ఫోటో ఒకటి షేర్ చేసింది. అందులో అనుష్క వెనకనుంచి కోహ్లీని హత్తుకుంది. ఈ ఫోటోలన్నీ ఇప్పుడు వైరల్ గా మారాయి.

 

loader