టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ అందాల తార అనుష్క శర్మ జంటకు క్రేజ్ ఎక్కువ. విడివిడిగా ఇద్దరికీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉన్నా... వీరిద్దరినీ జంటగా చూడటానికి అభిమానులు ఇష్టపడతారు. ఈ క్యూట్ కపుల్ తాజాగా సోషల్ మీడియాలో ఓ రొమాంటిక్ పిక్ ని షేర్ చేశారు. కాగా... ఆ పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అనుష్క ఆ పిక్ ని పోస్టు చేసిన కొన్ని నిమిషాల్లోనే అది వైరల్ గా మారడం గమనార్హం. ఈ ఫోటోలు ఇద్దరూ చాలా అందంగా ఉన్నారు. న్యూలుక్ లో కనిపిస్తున్నారు. పిక్ కూడా చాలా రొమాంటిక్ గా ఉంది. కోహ్లీ ఫార్మల్ డ్రస్ లో కనిపించగా... అనుష్క శర్మ కొంచెం ఫ్యాషన్ గా ముస్తాబయ్యింది. వీరిద్దరి ఫోటోకి అనుష్క హార్ట్ సింబల్ ఎమోజీని క్యాప్షన్ గా జత చేసింది. ఈ ఫోటోకి పదిలక్షలకు పైగా లైకులు రావడం విశేషం. ఇక కోహ్లీ కూడా తన ఇన్ స్టాలో తన సింగిల్ ఫోటోస్ ని షేర్ చేశాడు. వాటికి కూడా వీపరీతంగా లైక్స్, కామెంట్స్ వచ్చాయి. 

అనుష్కశర్మ, విరాట్ కోహ్లీ... కొన్ని సంవత్సరాలపాటు ప్రేమించుకొని 2017 డిసెంబర్ లో పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు. అప్పటి నుంచి ఇద్దరూ తమ కెరీర్ లో దూసుకుపోతూనే.. తమకంటూ సమయాన్ని కేటాయిస్తూ ఆనందంగా గడుపుతున్నారు. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

💞

A post shared by AnushkaSharma1588 (@anushkasharma) on Sep 27, 2019 at 6:54am PDT