ఎక్కడెక్కడో తాకాడు: అతనితో కాంబ్లీ దంపతులు అగ్లీగా... (వీడియో)

Vinod Kambli, wife Andrea in ugly scuffle with music composer, father
Highlights

మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ, ఆయన భార్య ఆండ్రియా చూచువారలకు అసహ్యంగా వినోదాన్ని పంచారు.

ముంబై: మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ, ఆయన భార్య ఆండ్రియా చూచువారలకు అసహ్యంగా వినోదాన్ని పంచారు. ముంబైలోని మలద్ ఇనార్బిట్ మాల్ వద్ద ఆదివారం సాయంత్రం వారిద్దరు మ్యూజిక్ కంపోజస్ అంకుర్ తివారీతోనూ ఆయన తండ్రి ఆర్కె తివారీతోనూ గొడవ పడ్డారు. 

ఆ గొడవ చూసేవారికి అసహ్యంగా అనిపించింది. ఆర్కే తివారీ తనను తాకరాని చోట్లలో తాకాడని ఆండ్రియా ఆరోపించింది.  అయితే, కాంబ్లీ దంపతులు తమను తిట్టారని, కొట్టారని, అండ్రియా చెప్పు తీసి కొట్టిందని అంకుర్ తివారీ, ఆర్కె తీవారీ ఆరోపిస్తున్నారు. 

తాము మాల్ లోని గేమ్ జోన్ కు సాయంత్రం 3 గంటలకు వెళ్లామని,  తన భార్య ఓ ముసలి వ్యక్తి చేయి పట్టుకుందని, అయితే అతను కావాలని తన భార్యను తాకరాని చోట్లలో తాకాడని, దాంతో తన భార్య అతని చేయి పట్టుకుందని, అతను ఆమె చేయిని విసిరికొట్టాడని వినోద్ కాంబ్లీ ముంబై మిర్రర్ తో చెప్పాడు. 

ఆ తర్వాత కొద్ది సేపటికి తాము ఫుడ్ కోర్టుకు వెళ్లామని, ఇద్దరు వ్యక్తులు అక్కడికి వచ్చారని, తన భార్యపై దాడి చేయడానికి ప్రయత్నించారని, వెనక్కి తగ్గాలని తాను చెప్పినప్పుడు మేం ఎవరమో నీకు తెలియదంటూ బెదిరించారని ఆయన వివరించారు. 

తన భార్యను ఎక్కడెక్కడో తాకాడని కాంబ్లీ ఆరోపించాడు. రద్దీని అవకాశంగా తీసుకుని అతను తనను ఎక్కడికెక్కడో తాకాడని ఆండ్రియా చెప్పింది. 

తాను తన పిల్లలతో ఆడుకుంటున్నప్పుడు ఆ వ్యక్తి తన చేతులను తనపై వేసి రుద్దాడని, చాలా రద్దీగా ఉంది కాబట్టి ఏమీ కాదని అతను భావించి ఉంటాడని, తాను అతని చేయి పట్టుకున్నానని, రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడడంతో బెదిరిపోయాడని, హిందీలో ఏదో అన్నాడని ఆమె చెప్పింది. 

కాగా, తన తల్లిదండ్రులు, కూతురు భార్యతో మాల్ కు వచ్చిన అంకుర్ తివారీ కాంబ్లీ దంపతుల ఆరోపణలను ఖండించారు. తన తండ్రి రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి అని, తన కూతురితో కలిలసి గేమ్ జోన్ కు వచ్చాడని, తాను అక్కడ వినోద్ కాంబ్లీని చూశానని తనకు తన తండ్రి చెప్పాడని, అతను మహిళను దాటేయడానికి వేగంగా నడుస్తున్న సమయంలో అతన్ని వెనక్కి నెట్టేశారని వివరించారు. 

జరిగిన విషయాన్ని తన తండ్రి తనకు చెప్పాడని, ఆ మహిళను గుర్తించాల్సిందిగా తాను తండ్రిని అడిగానని, ఆమె కాంబ్లీ భార్య అని తెలిసిందని ఆయన చెప్పారు. మీతో మాట్లాడుతానని తాను కాంబ్లీ దంపతులతో అన్నానని, అయితే వారు తనను నెట్టేశారని, దూషించారని, కాంబ్లీ భార్య చెప్పు తీసి తన వైపు చూపుతూ కొడుతానని బెదిరించిందని ఆయన చెప్పారు.

కాంబ్లీ పెద్దగా అరుస్తూ తనను దూషించాడని, ఆయన భార్య తనను నెట్టేసిందని, ఒకరు దాన్ని రికార్డు చేయబోతుంటే అతన్ని బెదిరించారని తివారీ చెప్పాడు. 

అక్కడ ప్రతి ఒక్కరినీ కాంబ్లీ తిట్టడం ప్రారంభించాడని, మర్యాదగా మాట్లాడాలని తాను చెప్పినా వినకుండా తనను నెట్టేశాడని, అతని భార్య కూడా నెట్టేసిందని, తాను పోలీసులను పిలువడానికి ప్రయత్నించానని, దాంతో కాంబ్లీ తన ఫోన్ లాక్కున్నాడని, వీడియో రికార్డు తొలగించారా లేదా అని చూడడానికి కాంబ్లీ ఓ మహిళ వెంట కూడా పడ్డాడని ఆయన వివరించాడు. 

కాంబ్లీ, ఆయన భార్య ఆండ్రియాలపై మ్యూజిక్ కంపోజర్, ఆయన తండ్రి సాయంత్రం నాలుగున్నర గంటలకు బంగుర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసు స్టేషన్ నుంచి ఆదివారంనాడు ఓ పోలీసు అధికారి కాంబ్లీ ఇంటికి వచ్చాడు. ఈ విషయాన్ని కాంబ్లీ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.

ప్రతి ఒక్కరూ వినోదంలా చూస్తుంటే తన భర్త అప్ సెట్ అయ్యాడని, ఆ సంఘటనను రికార్డు చేయడానికి ప్రయత్నిస్తుంటే మరింతగా నిస్పృహకు లోనయ్యాడని ఆండ్రియా చెప్పింది. ఆ సంఘటన యావత్తు తన పిల్లలు క్రిస్టియానో, జోహానాలకు భయంకరమైన అనుభవాన్ని చవి చూపించిందని కాంబ్లీ అన్నారు.

 

 

loader