ఇర్పాన్ పఠాన్ భార్యను చూసారా..? హీరోయిన్లకు ఏమాత్రం తక్కువలేదుగా...
టీమిండియా ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ సోదరుడెవరో అందరికీ తెలుసు. అతడి తల్లిదండ్రులు, కొడుకును కూడా చూసివుంటారు... కానీ ఆయన భార్యను మాత్రం ఇంతకాలం చూడలేకపోయాం. తాజాగా తన భార్యను పరిచయం చేసారు ఈ మాజీ క్రికెటర్.
హైదరాబాద్ : టీమిండియా మాజీ ఆల్ రౌండర్ ఇర్పాన్ పఠాన్ ఎట్టకేలకు తన అందమైన భార్యను ప్రపంచానికి పరిచయం చేసాడు. తమ ఎనిమిదవ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్యతో కలిసివున్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు పఠాన్. ఈ సందర్భంగా ఎమోషనల్ కామెంట్స్ కూడా చేసాడు.
''నా ప్రాణమైన నువ్వు అనేక బాధ్యతలు చేపడుతున్నావు. నన్ను నిరంతగా ఆనందంగా వుంచే భార్యగానే కాదు పిల్లల ఆలనాపాలన చూసుకునే తల్లిగా, మంచి స్నేహితురాలిగా వ్యవహరిస్తున్నావు. నీతో జర్నీ చాలా అద్భుతంగా వుంది. నువ్వు నా భార్యగా రావడం గర్వంగా ఫీల్ అవుతున్నా'' అంటూ ఎక్స్(ట్విట్టర్) వేదికగా భార్య సబా భేగ్ కు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపాడు ఇర్పాన్ పఠాన్.
ఎవరీ సబా బేగ్ :
భారత దేశానికి చెందిన మీర్జా ఫరూఖ్ బేగ్ సౌదీ అరేబియాలో స్థిరపడ్డారు. అక్కడ వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించుకుని కుటుంబంతో కలిసి అక్కడే స్థిరపడిపోయారు. ఇలా సౌదీలో ప్రముఖ వ్యాపారవేత్తగా వెలుగొందుతున్న ఆయన కూతురే ఇర్పాన్ పఠాన్ భార్య సపా బేగ్. ఆమె పెళ్లికి ముందు మోడల్ గా పనిచేసారు.
ఇర్ఫాన్ పఠాన్-సఫా ల పరిచయం 2014 లో జరిగింది. కొంతకాలం ప్రేమాయణం తర్వాత వీరిద్దరూ పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. 2016 లో పెళ్లి చేసుకున్న వీరికి ప్రస్తుతం ఓ కొడుకు సంతానం. ఆసక్తికర విషయం ఏంటంటే ఇర్ఫాన్, సఫాల మధ్య వయసు అంతరం పదేళ్లు.