Asianet News TeluguAsianet News Telugu

టీ20సిరీస్... పంత్ పై ట్రోల్స్.. అంతలోనే ప్రశంసలు

 తొలి టీ20లో గోల్డెన్‌డక్‌గా పెవిలియన్‌ చేరిన రిషభ్‌.. రెండో టీ20లో 4 పరుగులు మాత్రమే చేశాడు. అయితే వికెట్ల వెనుక కీపర్‌ పాత్ర పోషించే క్రమంలో రిషభ్‌ పంత్‌ చేసిన సూచన ఒకటి ఆకట్టుకుంది. బ్యాటింగ్ విషయంలో.. పంత్ ని నెటిజన్లు ఏకి పారేశారు. రకరకాల మీమ్స్ తో విపరీతంగా ట్రోల్ చేశారు. అయితే... అలా ట్రోల్ చేసిన వారే మళ్లీ పంత్ పై ప్రశంసలు కురిపించడం గమనార్హం.

Twitter trolls Rishabh Pant as he disappoints twice in two matches
Author
Hyderabad, First Published Aug 5, 2019, 11:55 AM IST

వెస్టిండీస్ తో జరిగిన రెండు టీ20ల్లోనూ భారత్ విజయం సాధించిన సిరీస్ గెలుచుకుంది. కాగా... టీం ఇండియా విజయం పట్ల ఇండియన్ అభిమానులంతా ఆనందంతో ఉన్నారు. కాగా... యువ క్రికెటర్ రిషబ్ పంత్ పై మాత్రం కొందరు ప్రశంసలు కురిపిస్తుండగా... మరికొందరు విమర్శలు కురిపిస్తున్నారు.

ఇంతకీ మ్యాటరేంటంటే... తొలి టీ20లో గోల్డెన్‌డక్‌గా పెవిలియన్‌ చేరిన రిషభ్‌.. రెండో టీ20లో 4 పరుగులు మాత్రమే చేశాడు. అయితే వికెట్ల వెనుక కీపర్‌ పాత్ర పోషించే క్రమంలో రిషభ్‌ పంత్‌ చేసిన సూచన ఒకటి ఆకట్టుకుంది. బ్యాటింగ్ విషయంలో.. పంత్ ని నెటిజన్లు ఏకి పారేశారు. రకరకాల మీమ్స్ తో విపరీతంగా ట్రోల్ చేశారు. అయితే... అలా ట్రోల్ చేసిన వారే మళ్లీ పంత్ పై ప్రశంసలు కురిపించడం గమనార్హం.

తొలి టీ20లో పొలార్డ్‌ ఎల్బీ విషయంలో డీఆర్‌ఎస్‌కు వెళ్లడానికి కోహ్లి తటపటాయిస్తుంటే రిషభ్‌ పంత్‌ అది ఔటేనని రివ్యూ తీసుకుందామని తెలియజేశాడు. అంతే ఆ రివ్యూ సక్సెస్‌ కావడం, పొలార్డ్‌ పెవిలియన్‌కు చేరడం చకచకా జరిగిపోయాయి. దాంతో రిషభ్‌ను కోహ్లి చప్పట్లతో అభినందించాడు. మరొకవైపు అభిమానులు కూడా పంత్‌ డీఆర్‌ఎస్‌ విషయంలో సక్సెస్‌ కావడంతో ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు.

పంత్ చాలా తెలివిగా ఆలోచించాడని అభిమానులు మురిసిపోతున్నారు. ఒకానొక సమయంలో అచ్చం ధోనీలానే ఆలోచించాడని పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుత టీం కి రిషబ్ పంత్ అత్యుత్తమ కీపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios