అనుకున్నదే జరిగింది టోక్యో ఒలింపిక్స్ 2020ను జపాన్ ప్రభుత్వం వాయిదా వేసింది. ఒక ఏడాది పాటు ఒలింపిక్స్ నిర్వహణను వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

కరోనా ప్రభావం ఉన్నప్పటికీ ఈ నెలారంభంలో ఒలింపిక్స్ నిర్వహించాలని జపాన్ ప్రభుత్వం భావించినప్పటికీ రోజు రోజుకీ వైరస్ వ్యాప్తి తీవ్రం కావడంతో ఒలింపిక్స్‌ను వాయిదా వేయక తప్పలేదు. మళ్లీ ఎప్పుడు నిర్వహించేది త్వరలోనే తెలియజేస్తామని ప్రకటించింది.

Also Read:ఒలింపిక్స్ కు కరోనా దెబ్బ: ఖాళీ స్టేడియంలోనే...

కరోనా ఎఫెక్ట్ దృష్ట్యా ఇప్పటికే కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాలు ఈ క్రీడలకు దూరమయ్యాయి. అలాగే తమ అథ్లెట్లు వచ్చే సంవత్సరం క్రీడలకు సన్నద్ధమవుతారని పలు దేశాలు ప్రకటించాయి.

చాలా దేశాలు వాయిదా వేయాలని కోరుతుండటంతో అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ క్రీడలను వాయిదా వేసింది. అయితే జపాన్ ప్రభుత్వం మాత్రం ఒలింపిక్స్ క్రీడలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని షెడ్యూల్ ప్రకారమే జరపాలని పట్టుబట్టింది.

Also Read:కరోనా దెబ్బ: ఐపీఎల్ వాయిదా...కొత్త ఆరంభ తేదీ ఇదే!

ముందుగా అనుకున్న దాని ప్రకారం జూలై 24 నుంచి ఆగస్టు 9 వరకు ఒలింపిక్స్ జరగాల్సి వుంది. ఇప్పటికే చాలా క్రీడలు రద్దయిన నేపథ్యంలో జపాన్ ప్రభుత్వం సైతం ఒలింపిక్స్ వాయిదా వైపు మొగ్గు చూపకతప్పలేదు. ఇప్పటికే క్వాలిఫైయింగ్ టోర్నీలు రద్దైన సంగతి తెలిసిందే.