ఒలింపిక్ విలేజ్‌లో కరోనా పాజిటివ్ కేసులు... విశ్వక్రీడల ఆరంభానికి ముందే...
ఒలింపిక్ విలేజ్‌లో కరోనా పాజిటివ్ కేసు నమోదు...
గత వారం రోజుల్లో ఒలింపిక్ సంబంధిత అధికారుల్లో 13 పాజిటివ్ కేసులు...
టోక్యో ఒలింపిక్స్ ఇంకా ప్రారంభం కాకముందే, కరోనా వైరస్ తాకిడి మొదలైంది. టోక్యోలోని ఒలింపిక్ విలేజ్‌లో పాజిటివ్ కేసు నమోదైంది. ఒలింపిక్ అసోసియేషన్‌కి చెందిన అధికారికి కరోనా పాజిటివ్ రావడంతో అథ్లెట్లలో భయాందోళనలు మొదలవుతున్నాయి...
మరో ఆరు రోజుల్లో జూలై 23 నుంచి ఒలింపిక్స్ మొదలు కానున్నాయి. కరోనా పాజిటివ్‌గా తేలిన అధికారిని 14 రోజుల ఐసోలేషన్, క్వారంటైన్‌లోకి తరలించినట్టు తెలిపింది ఐఓఏ.
ఒలింపిక్ అసోసియేషన్‌తో పాటు ఇంటర్నేషనల్ పారా ఒలింపిక్ కమిటీ, ఎన్‌జీవో, ఎన్‌పీసీ, ఫెడరేషన్, ఇతర సభ్యులతో కలిపి గత వారం రోజుల్లో 13 పాజిటివ్ కేసులు వచ్చినట్టు ఒలింపిక్ సంఘం తెలియచేసింది.
వీరితో పాటు ఒలింపిక్స్ కోసం జపాన్ చేరిన అథ్లెట్లలో నలుగురికి పాజిటివ్ వచ్చింది. వీరిని ఐసోలేషన్‌కి తరలించారు అధికారులు. ఒలింపిక్స్ మొదలయ్యే సమయానికి వీళ్లు కరోనా నుంచి కోలుకోకపోతే, విశ్వక్రీడల్లో పాల్గొనే అవకాశం కోల్పోవాల్సి ఉంటుంది.