ఒలింపిక్స్‌లో కరోనా కలవరం... అమెరికా జిమ్నాస్టిక్‌కి పాజిటివ్...
జపాన్‌లో ట్రైయినింగ్ సెషన్స్‌లో పాల్గొంటున్న అమెరికా జిమ్నాస్టిక్‌కి పాజిటివ్...
ఆమెతో కలిసిన మరో అథ్లెట్‌నూ ఐసోలేషన్‌కి తరలించిన అధికారులు...
ఒలింపిక్ విలేజ్‌లో రోజురోజుకీ పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్య...
ఒలింపిక్స్ ప్రారంభానికి సమయం దగ్గర పడుతున్నాకొద్దీ, కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ ఉంది. ఇప్పటికే ఒలింపిక్ విలేజ్‌లో అధికారులకు పాజిటివ్‌గా తేలగా, తాజాగా ఒలింపిక్స్ కోసం జపాన్ చేరిన ఓ అమెరికన్ యువ జిమ్నాస్టిక్‌కి కరోనా సోకింది...
అమెరికాకి చెందిన ఈ టీనేజ్ జిమ్మాస్టిక్, ప్రస్తుతం జపాన్‌లోని సిటీ ఆఫ్ ఇంజాయ్‌లో ప్రీ ట్రైయినింగ్ క్యాంపులో శిక్షణ పొందుతోంది. ఆ టీనేజ్ జిమ్మాస్టిక్‌తో కలిసిన కారణంగా మరో జిమ్నాస్టిక్‌ను కూడా హోటల్ గదిలో ఐసోలేషన్‌లో ఉంచారు అధికారులు.
అమెరికా నుంచి 10 మంది జిమ్నాస్టిక్స్ ప్లేయర్లు, ఒలింపిక్స్ కోసం జపాన్ చేరుకోగా వీరికి తరుచూ పరీక్షలు నిర్వహిస్తున్నారు ఒలింపిక్ అధికారులు. ఇప్పటికే ఒలింపిక్ కోసం వచ్చిన సౌతాఫ్రికా మెన్స్ ఫుట్‌బాల్ టీమ్‌లో ఇద్దరికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో సౌతాఫ్రికా టీమ్ మొత్తాన్ని ఐసోలేషన్‌కి తరలించారు అధికారులు.