Asianet News TeluguAsianet News Telugu

టోక్యో ఒలింపిక్స్: ఆర్చర్‌లో తరుణ్‌దీప్ రాయ్‌ ఓటమి... రోయింగ్‌లో కూడా తప్పని నిరాశ...

రౌండ్‌ 16లో ఇజ్రాయిల్‌కి చెందిన షాన్నీ ఈటేతో జరిగిన మ్యాచ్‌లో 6-5 తేడాతో పోరాడి ఓడిన తరుణ్‌దీప్ రాయ్...

రోయింగ్‌ సెమీస్‌లో ఓడిన భారత ప్లేయర్లు అర్జున్ లాల్, అర్వింద్ సింగ్...

Tokyo 2020: Archer Tarundeep Rai losses in Round 16, And Indian Rowers Pair in semis CRA
Author
India, First Published Jul 28, 2021, 8:46 AM IST

టోక్యో ఒలింపిక్స్‌లో భారత ఆర్చర్ల ఫెయిల్యూర్ కొనసాగుతూనే ఉంది. భారత ఆర్చర్ తరుణ్‌దీప్ రాయ్, పురుషుల వ్యక్తిగత ఎలమినేషన్స్‌లో జరిగిన మ్యాచ్‌లో ఉక్రెయిన్‌కి చెందిన ఓలెసి హన్‌బిన్‌పై 6-4 తేడాతో విజయాన్ని అందుకుని, రౌండ్ 16కి అర్హత సాధించాడు. 

అయితే రౌండ్‌ 16లో ఇజ్రాయిల్‌కి చెందిన షాన్నీ ఈటేతో జరిగిన మ్యాచ్‌లో 6-5 తేడాతో పోరాడి ఓడాడు తరుణ్‌దీప్ రాయ్. 

రోయింగ్‌ సెమీస్‌లో మెన్స్ డబుల్ స్కల్స్ ఈవెంట్‌లో భారత ప్లేయర్లు అర్జున్ లాల్, అర్వింద్ సింగ్ ఆరో స్థానంలో నిలిచి, ఫైనల్స్‌కి అర్హత సాధించలేకపోయారు. ఒలింపిక్స్‌లో రోయింగ్‌ ఈవెంట్‌లో సెమీస్‌ చేరిన మొట్టమొదటి భారత అథ్లెట్లుగా సరికొత్త రికార్డు క్రియేట్ చేశారు అర్జున్ లాల్, అర్వింద్ సింగ్. 

 

టోక్యో ఒలింపిక్స్‌లో భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు, మూడో రౌండ్‌లోకి దూసుకెళ్లింది.  హంకాంగ్‌కి చెందిన చెంగ్ నాన్ లీతో జరిగిన మ్యాచ్‌లో 21-9,  21-16 తేడాతో, వరుసగా రెండు సెట్లను గెలిచి, మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. ఈ విజయంతో పీవీ సింధు, రౌండ్ 16కి అర్హత సాధించింది.

అంతకుముందు పూల్‌ ఏలో జరిగిన గ్రేట్ బ్రిటన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత మహిళా హాకీ జట్టు 1-4 తేడాతో ఓడింది. టోక్యో ఒలింపిక్స్‌లో భారత మహిళా హాకీ జట్టుకి ఇది వరుసగా మూడో ఓటమి. 

Follow Us:
Download App:
  • android
  • ios