Asianet News TeluguAsianet News Telugu

ఈ మెడల్ మా నాన్నకి అంకితం.. గోల్ కీపర్ శ్రీజేష్ ట్వీట్ వైరల్

పతకం అందుకున్న తర్వాత ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారుతోంది.  ఆయన చేసిన ట్వీట్ కి 70వేల లైకులు.. 12వేల రీట్వీట్లు చేయడం విశేషం.

This Medal Is For You My Achaaan : PR Sreejesh's Tweet Is Viral
Author
Hyderabad, First Published Aug 6, 2021, 2:49 PM IST


టోక్యో ఒలంపిక్స్ లో భారత పురుషుల జట్టు విజయం సాధించింది. 41ఏళ్ల తర్వాత హాకీ జట్టు ఈ ఘనత సాధించింది. దీంతో.. అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. ఈ జట్టులో గోల్ కోపర్  పీఆర్ శ్రీజేష్  ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. జట్టు విజయం సాధించడంలో ఈయన కీలక పాత్ర పోషించాడు.

దీంతో.. అందరి కళ్లు అతనిపై పడ్డాయి. కాగా పతకం అందుకున్న తర్వాత ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారుతోంది.  ఆయన చేసిన ట్వీట్ కి 70వేల లైకులు.. 12వేల రీట్వీట్లు చేయడం విశేషం.

శ్రీజేష్ ఆ ట్వీట్.. తన తండ్రి గురించి చేయడం విశేషం. తన తండ్రి తన హీరో అంటూ.. ఈ పతకాన్ని తన తండ్రికి అంకితమిస్తున్నట్లు పేర్కొనడం గమనార్హం. తన తండ్రి, కుటుంబసభ్యులు తన విజయాన్ని సంబరం చేసుకుంటుండగా.. దాని వీడియోని శ్రీజేష్ షేర్ చేశారు.

 

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే .. హోరా హోరీ పోరులో చివరికి జర్మనీపై  మన్ ప్రీత్ సింగ్ నేతృత్వంలో టీమిండియా హాకీ జట్టు  ఆధిపత్యాన్ని చాటుకుంది. 41 సంవత్సరాల తర్వాత ఒలింపిక్ పతకం సాధించి చరిత్రను తిరగ రాసింది. ముఖ్యంగా నువ్వా నేనా అన్నట్టుగా ఉత్కంఠ భరితంగా సాగిన ఈ టఫ్‌ ఫైట్‌ లో భారత్‌ 5-4 తేడాతో జయకేతనం ఎగురవేసి కాంస్యం దక్కించుకుంది.

Follow Us:
Download App:
  • android
  • ios