Asianet News TeluguAsianet News Telugu

థాంక్యూ... కానీ విజయం పూర్తిగా నీ సొంతం: నీరజ్ చోప్రా కి అభినవ్ బింద్రా రిప్లై

అభినవ్ బింద్రా స్ఫూర్తితోనే తాను గోల్డ్ కొట్టానన్న వ్యాఖ్యలపై అభినవ్ బింద్రా స్పందించాడు. థాంక్స్ చెబుతూనే విజయం పూర్తిగా నీరజ్ సొంతమన్నారు. 

Thanks For the Kind Words... But Victory is All Yours: Abhinav Bindra To Neeraj Chopra
Author
New Delhi, First Published Aug 10, 2021, 12:43 PM IST

టోక్యోలో గోల్డ్ మెడల్ సాధించిన జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా తాను అభినవ్ బింద్రా సాధించిన తొలి స్వర్ణం చూసి స్ఫూర్తి పొంది.... అదే లక్ష్యంగా కృషి చేసి ఈ పతకాన్ని సాధించినట్టు ఏషియానెట్ కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో చెప్పిన విషయం తెలిసిందే..!

దీనిపై అభినవ్ బింద్రా స్పందిస్తూ.... తనన గురించి చెప్పిన మంచి మాటలకు థాంక్స్ చెబుతూనే... నీరజ్ సాధించిన గోల్డ్ మెడల్ కి కారణం అతని హార్డ్ వర్క్, డెడికేషన్ అని ఈ ఆనందాన్ని పూర్తిగా ఆస్వాదించమని చెప్పాడు. 

ఏషియా నెట్ తో మాట్లాడుతూ.... నీరజ్ చోప్రా.... భారత దేశంలో ప్రతి అథ్లెట్ కూడా అభినవ్ బింద్రాకు చూసి స్ఫూర్తి పొందుతారని, ఆయన్ని రోల్ మోడల్ లా ఊహించుకుంటూ కృషి చేస్తారని తెలిపాడు. తాను పాల్గొన్న తొలి ఒలింపిక్స్ లోనే అభినవ్ బింద్రా సరసన నిలవడం చాలా సంతోషంగా ఉందన్నాడు. వ్యక్తిగత విభాగంలో తొలి స్వర్ణపతకాన్ని గెలిచిన భారతీయుడిగా అభినవ్ బింద్రా నిలిచిన విషయం తెలిసిందే..!

2012 లండన్ ఒలింపిక్స్‌లో రెండు రజతాలు, నాలుగు కాంస్యాలతో ఆరో స్థానంలో నిలిచిన భారత్, ఈసారి ఓ స్వర్ణం, రెండు రజతాలు, నాలుగు కాంస్యాలతో ఏడు పతకాలు సాధించి అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చి 48వ స్థానంలో నిలిచింది. 1980 తరువాత భారత్ కి ఇదే అత్యుత్తమ ర్యాంకింగ్. 

2020 టోక్యో ఒలింపిక్స్‌ ర్యాంకింగ్స్‌లో అమెరికా టాప్‌లో నిలిచింది... రెండో స్థానంలో నిలిచిన చైనా కంటే, అమెరికా ఓ స్వర్ణం ఎక్కువగా సాధించింది. అమెరికా 39 స్వర్ణాలు, 41 రజతాలు, 33 కాంస్యాలతో 113 మెడల్స్ సాధించగా... చైనా 38 స్వర్ణాలు, 32 రజతాలు, 18 కాంస్యాలతో 88 మెడల్స్ సాధించింది. 

టోక్యో ఒలింపిక్స్ ముగియడంతో ఒలింపిక్ జెండాని పారిస్ మేయర్ అన్నే హిగాల్డోకి అందచేశారు ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ఛీఫ్ థామస్ బాచ్. 2024లో పారిస్ వేదికగా ఒలింపిక్స్ జరగనున్న విషయం తెలిసిందే..!

Follow Us:
Download App:
  • android
  • ios