లాక్‌డౌన్ కారణంగా అన్ని రకాల క్రీడలు వాయిదా పడటంతో క్రీడా ప్రముఖులు కుటుంబంతో గడపటంతో పాటు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో బాగా టచ్‌లో ఉంటున్నారు.

Also Read:నెరిసిన గడ్డంతో.. గుర్తుపట్టలేని విధంగా ధోనీ న్యూలుక్

ఈ నేపథ్యంలో భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా సైతం.. తన ప్రైవేట్ లైఫ్‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలను అభిమానులతో పంచుకుంటున్నారు. తాజాగా సానియా తన కుమారు ఇజాన్ మీర్జా మాలిక్‌తో కలిసి సరదాగా చేసిన ఓ సంభాషణకు సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు.

ఈ వీడియోకు ‘ బాబాయ్ (అసద్) ఫోర్ కొడితే.. బాబా (షోయబ్ మాలిక్) సిక్సర్ కొడతారని సానియా కామెంట్ చేశారు. ఇక ఈ సంభాషణలో సానియా మీర్జా తన కుమారుడితో మాట్లాడుతూ.. కుక్క ఎలా అరుస్తుంది బేబీ అని అడిగితే.. దానికి ఇజాన్, బౌబౌ అంటూ కుక్కను అనుకరిస్తూ సమాధానం ఇచ్చాడు.

Also Read:ఆడితే కాల్చి చంపేస్తామన్నారు... భయంతోనే ఆడాను: వర్ణ వివక్షపై ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్

అసద్ బాబాయ్ ఏం చేస్తారని అడిగితే ఫోర్ కొడతారని సానియా బదులిచ్చారు. అదే విధంగా బాబా (షోయబ్ మాలిక్) ఏం చేస్తారని అడుగుతూ.. బాబా సిక్సర్ బాదుతారని సానియా మీర్జా సరదాగా చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లతో  పాటు పలువురు క్రీడా ప్రముఖులు కూడా దీనిని లైక్ చేస్తున్నారు.