టీం ఇండియా యువ క్రికెటర్ రిషబ్ పంత్ ని దక్షిణాఫ్రికాతో జరగనున్న టెస్టు మ్యాచ్ కి దూరం పెట్టేశారు. ఈ విషయాన్ని కెప్టెన్ విరాట్ కోహ్లీ స్వయంగా వెల్లడించారు. పంత్ స్థానంలో సీనియర్ కీపర్ వృద్ధిమాన్ సాహాను తీసుకున్నట్లు కోహ్లీ తెలిపాడు. గతేడాది జనవరిలో గాయం కారణంగా సాహా ఆటకు దూరమైన సంగతి తెలిసిందే. శస్త్ర చికిత్స అనంతరం సాహా ఇంతకాలం రెస్టు తీసుకున్నాడు.

సాహాకి గాయం అవ్వడం కారణంగానే అప్పుడు పంత్ కి చోటు దక్కింది. అయితే... పంత్ అనుకున్నస్థాయిలో రాణించలేకపోయాడు. దీంతో అతని ఆటతీరుపై విమర్శలు వచ్చాయి. నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేశారు. గత నెలలోజరిగిన విండీస్ పర్యటనలో అనవసరపు షాట్లు ఆడి పంత్ మరింత విమర్శలు ఎదుర్కొన్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు దక్షిణాఫ్రికా టెస్టు మ్యాచ్ కి అతనిని దూరం చేసినట్లు తెలుస్తోంది.

అయితే... పంత్ ని పక్కన పెడుతూ సెలక్టర్లు తీసుకున్న నిర్ణయం పట్ల అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మంచి నిర్ణయం తీసుకున్నారంటూ అభిమానులు ట్విట్టర్ లో పేర్కొనడం విశేషం. పంత్ కన్నా సాహానే అద్భుతమైన కీపర్ అంటూ ట్వీట్లు చేస్తున్నారు. పంత్ తన ఆటను మెరుగుపరుచుకోవాలని కొందరు సూచిస్తుండటం విశేషం. ఇంకొందరేమో పంత్ కి ఇచ్చి గుణపాఠం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.