అదరగొట్టిన యువ అథ్లెట్లు... జూనియర్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో భారత్‌కి...
4X400 మిక్స్‌డ్ రిలే ఈవెంట్‌లో మూడో స్థానంలో నిలిచి కాంస్యం సాధించిన టీమిండియా... 3:20.60 సెకన్లలో పోటీని పూర్తిచేసిన భారత అథ్లెట్లు అబ్దుల్ రజాక్, ప్రియా మోహన్, సుమ్మీ, కపిల్...
టోక్యో ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్ల విజయం ఇచ్చిన ఉత్సాహంతో యువ అథ్లెట్లు అదరగొడుతున్నారు. వరల్డ్ జూనియర్ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ 6 పతకాలు సాధించింది. 61 కేజీల విబాగంలో రవీందర్ రజతం గెలవగా 74 కేజీల విభాగంలో యష్, 79 కేజీల విభాగంలో గౌరవ్ బలియాన్, 92 కేజీల విభాగంలో పృథ్వీరాజ్ పాటిల్, 97 కేజీల విభాగంలో దీపక్, 125 కేజీల విభాగంలో అనిరుథ్ కుమార్ కాంస్య పతకాలు సాధించారు.
అలాగే జూనియర్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లోనే భారత అథ్లెట్లు అదరొట్టారు. నైరోబీలో జరిగిన ఈ పోటీల్లో 4X400 మిక్స్‌డ్ రిలే ఈవెంట్‌లో పోటీపడిన భారత యువ అథ్లెట్లు, మూడో స్థానంలో నిలిచి కాంస్యం సాధించారు. 3:20.60 సెకన్లలో పోటీని పూర్తిచేసిన భారత అథ్లెట్లు అబ్దుల్ రజాక్, ప్రియా మోహన్, సుమ్మీ, కపిల్... ఈ ఎడిషన్‌లో భారత్‌కి తొలి పతకం అందించారు.
అండర్20 వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో పతకం సాధించిన భారత అథ్లెట్లకు భారత మాజీ అథ్లెట్, ‘పరుగుల రాణి’ పీటీ ఊషా అభినందనలు తెలిపారు. అండర్20 వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కి ఇది ఓవరాల్‌గా ఐదో పతకం మాత్రమే. డిస్కస్ త్రోలో 2002లో సీమా అంటిల్, 2014లో నవ్‌జీత్ కౌర్ దిల్లాన్ కాంస్య పతకాలు సాధించారు.
టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన జావెలిన్ త్రో అథ్లెట్ నీరజ్ చోప్రా, 2016 వరల్డ్ జూనియర్ ఛాంపియన్‌షిప్స్‌లో స్వర్ణం సాధించాడు. 2018లో భారత యంగ్ స్ప్రింటర్ హిమా దాస్, అండర్20 ఛాంపియన్‌షిప్స్‌లో 400 మీటర్ల ఈవెంట్‌ను 51.46 సెకన్లలో పూర్తి చేసి స్వర్ణాన్ని అందుకుంది.