టీం ఇండియా క్రికెటర్ సురేష్ రైనా మోకాలికి శస్త్ర  చికిత్స జరిగింది. గత కొంతకాలంగా సురేష్ రైనా మోకాలి సమస్యతో బాధపడుతున్నాడు. కాగా... తాజాగా రైనా ఆ‌మ్‌స్టర్‌డ్యాం‌‌లో చికిత్స చేయించుకున్నాడు. శస్త్రచికిత్స విజయవంతమైనట్లు డాక్టర్లు తెలిపారు. రైనా కోలుకోవడానికి దాదాపు 6 వారాల సమయం పడుతుందని చెప్పారు. రైనా కోలుకోవాలని అతని అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

కాగా.. ఈ ఘటనపై బీసీసీఐ ట్విట్టర్ వేదికగా స్పందించింది. రైనా త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు బీసీసీఐ ట్వీట్ చేసింది. రైనా ఇప్పటి వరకు 18 టెస్ట్ మ్యాచ్ లు ఆడారు. 226 వన్డే అంతర్జాతీయ మ్యాచ్ లు, 78 టీ 20 అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడారు. చివరగా రైనా జులై 2018లో ఇంగ్లాండ్ తో వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడారు.