కోహ్లీ తీసుకున్న నిర్ణయాల కారణంగానే టీం ఇండియా వన్డే సిరీస్ చేజార్చుకుందని టీం ఇండియా మాజీ క్రికెటర్ గవాస్కర్ అభిప్రాయపడ్డారు. బుధవారం జరిగిన ఆఖరి వన్డేలో 35పరుగుల తేడాతో టీం ఇండియా ఓటమి పాలైన సంగతి తెలిసిందే. కాగా ఓటమికి కోహ్లీనే కారణమంటూ.. గవాస్కర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

సిరీస్‌ గెలవకముందే ప్రయోగాలు చేయడం భారత పరాజయానికి కారణమని గవాస్కర్‌ చెప్పుకొచ్చాడు. సిరీస్‌ గెలిచిన తర్వాత ప్రయోగాలు చేసి ఉంటే బాగుండేదని, ఆసీస్‌ను తక్కువ అంచనా వేయడం, కోహ్లి అనాలోచిత నిర్ణయాలతో సిరీస్‌ చేజారిందన్నాడు. 

తొలి రెండు వన్డేలు గెలిచి ఆధిపత్యం కనబర్చిన భారత్‌.. మరో మ్యాచ్‌ గెలిచాక ప్రయోగాలు చేయాల్సిందన్నాడు. ప్రపంచకప్ ముంగిట జట్టు రిజర్వ్ బెంచ్‌ని పరీక్షించుకోవడం ముఖ్యమే.. కానీ.. సిరీస్‌లో విజేతగా నిలవడం అంతకన్నా కీలకమని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు.