పారాలింపిక్స్‌లో భారత్‌కి రెండో స్వర్ణం... జావెలిన్ త్రోలో సుమిత్ అంటిల్ ప్రపంచరికార్డు...

జావెలిన్ త్రో ఈవెంట్‌లో మూడుసార్లు వరల్డ్ రికార్డు క్రియేట్ చేసిన సుమిత్ అంటిల్... పారాలింపిక్స్‌లో భారత్‌కి రెండో స్వర్ణం...

Sumit Antil  won second gold medal for India with World Record feat in Javelin throw

పారాలింపిక్స్‌లో భారత్‌కి రెండో స్వర్ణం దక్కింది. మెన్స్ జావెలిన్ త్రో ఎఫ్64 విభాగంలో పోటీపడిన భారత పారా అథ్లెట్ సుమిత్ అంటిల్ వరల్డ్ రికార్డు త్రోలతో గోల్డ్ మెడల్ సాధించాడు. తన మొదటి ప్రయత్నంలోనే 66.95 విసిరి ప్రపంచ రికార్డు సృష్టించిన సుమిత్, రెండో ప్రయత్నంలో ఏకంగా 68.08 మీటర్లు విసిరి తన రికార్డును తానే అధిగమించాడు...

మూడో ప్రయత్నంలో 65.27 మీటర్లు, నాలుగో ప్రయత్నంలో 66.71 మీటర్లు విసిరిన సుమిత్... తన ఐదో ప్రయత్నంలో 68.55 మీటర్లు విసిరి, సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇదే ఈవెంట్‌లో పోటీపడిన మరో భారత పారా అథ్లెట్ సందీప్ చౌదరీ అత్యుత్తమంగా 62.03 మీటర్లు విసిరి నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు.

సుమిత్ సాధించిన పతకంతో కలిసి పారాలింపిక్స్‌లో భారత పతకాల సంఖ్య మళ్లీ ఏడుకి చేరింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ షూటింగ్‌లో అవనీ లేఖరా స్వర్ణం సాధించగా టీటీలో భవీనా పటేల్, మెన్స్ హైజంప్ ఈవెంట్‌లో నిషద్ కుమార్, డిస్కస్ త్రో ఈవెంట్‌లో యోగేశ్ కతునియా, జావెలిన్ త్రో ఎఫ్46లో దేవేంద్ర జాజారియా రజత పతకాలు సాధించారు.

జావెలిన్ త్రో ఎఫ్46లో పోటీపడిన మరో భారత అథ్లెట్ సుందర్ సింగ్ గుర్జర్ కాంస్యం గెలవగా, డిస్కస్ త్రో ఎఫ్52 విభాగంలో పోటీపడి కాంస్యం గెలిచిన వినోద్ కుమార్‌... క్లాసిఫికేషన్స్‌లో తప్పులు ఉన్నందున‌ పతకాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించింది పారాలింపిక్స్ కమిటీ..

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios