యువరాజ్ సింగ్ సిక్సర్ల మోత.. చాహల్ కి తిప్పలు తెచ్చిపెట్టింది. ఐపీఎల్ లో భాగంగా ఆర్సీబీ తో గురువారం ముంబయి ఇండియన్స్ తలపడిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ మ్యాచ్ లో యువీ తన బ్యాటింగ్ రెచ్చిపోయాడు. సిక్సర్ల మోత మోగించాడు. 

క్రీజులో ఉన్నది కాసేపు అయినా ఆర్సీబీకీ ముఖ్యంగా స్పిన్నర్‌ చహల్‌కు చెమటలు పట్టించాడు. ఈ విషయం గురించి మ్యాచ్‌ అనంతరం చహల్‌ మాట్లాడుతూ... ‘ యువరాజ్‌ నా బౌలింగ్‌లో వరుసగా మూడు సిక్సర్లు కొట్టిన తర్వాత స్టువర్ట్‌ బ్రాడ్‌లా ఫీలయ్యాను. అయితే యువీ ఓ లెజండరీ బ్యాట్స్‌మెన్‌ అని నాకు తెలుసు. పైగా అది చిన్న స్టేడియం. కాబట్టి బంతిని సులభంగా బౌండరీ దాటించవచ్చు. అయినా నా వరకు నేను బాగానే బౌలింగ్‌ చేశా అనుకుంటున్నా’ అని చెప్పుకొచ్చాడు.

చాహల్ తన పేరును వాడటంపై స్టువర్ట్ బ్రాడ్ కూడా స్పందించాడు. పదేళ్లలో 437 టెస్టు వికెట్లు తీసిన బౌలర్ గా కూడా చాహల్ ఫీల్ అవ్వాలని ఆశిస్తున్నానని సెటైర్ వేశారు.

కాగా 2007 ఐసీసీ టీ20 వరల్డ్ కప్ లో స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్ లో యువీ ఒకే ఓవర్ లో ఆరు సిక్సర్లు కొట్టి రికార్డు క్రియేట్ చేశారు. దీనిని ప్రస్తావిస్తూనే చాహల్ పైవిధంగా కామెంట్స్ చేయగా.. అది నచ్చని స్టువర్ట్ తన గొప్పతనాన్ని చెప్పుకుంటూ చాహల్ కి సెటైర్ వేశాడు.