తాను ఓ అమ్మాయితో స్వలింగ సంబంధం పెట్టుకున్నట్లు చెప్పి సంచలనం సృష్టించిన స్ప్రింటర్ ద్యుతీ చాంద్ మరోసారి వార్తల్లో నిలిచారు. తనలో మగ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయనే కారణంగా తనను వదిలేశాడని తెలిపింది.

2009లో ఎనిమిదో తరగతిలో ఉన్నప్పటి నుంచి అతనుతో ప్రేమలో ఉన్నానని చెప్పిన ద్యుతీ.. తనలో టెస్టోస్టెరాన్‌ల సంఖ్య ఎక్కువగా ఉన్నాయని తెలిసిందని ద్యుతి వెల్లడించింది.

తన బాయ్‌ఫ్రెండ్ తనకు 2014లో బ్రేకప్ చెప్పాడని.. మన ఇద్దరికి పిల్లలు పుట్టనప్పుడు మనం కలిసి ఉండి ఏం లాభమని తనను ప్రశ్నించి.. వదిలేశాడని ద్యుతీ గుర్తు చేసుకుంది.

2018 ఆసియా గేమ్స్‌లో స్వర్ణ పతకం సాధించిన ద్యుతీ ఓ అమ్మాయితో డేటింగ్ చేస్తున్నానని, తన భవిష్యత్తు మొత్తం ఆ అమ్మాయితోనే ఉంటుందని చెప్పింది. అక్కడితో ఆగకుండా కుటుంబసభ్యుల నుంచి తనకు ప్రమాదం పొంచి వుందని కూడా పేర్కొంది.

అయితే ద్యుతీ అక్క మాత్రం ఈ వ్యాఖ్యలను ప్రతిఘటించింది. ద్యుతీ ఆస్తిని కాజేయాలనే దురుద్దేశంతోనే ఆ అమ్మాయి కుటుంబసభ్యులు నాటకాలు ఆడుతున్నారని.. తన చెల్లిని క్రీడల నుంచి దూరం చేసి.. ఆమె కెరీర్‌ని నాశనం చేయాలని వారు కుట్ర పన్నుతున్నారని చెప్పింది.

అయితే ఓ అమ్మాయితో స్వలింగ సంపర్కంలో ఉన్నట్లు చెప్పిన ద్యుతీపై నెటిజన్లు సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు.. ఆమె నిర్ణయం సరైనదంటూ కామెంట్లు పెడుతున్నారు.