Asianet News TeluguAsianet News Telugu

స్పోర్ట్స్ వీక్లి రౌండప్: క్రికెటర్లపై కేసులు, మైనర్ క్రీడాకారిణిపై లైంగిక వేధింపులు...మరెన్నో

వారంలో ఆరు రోజులు తమ తమ పనుల్లో బిజీబిజీగా వుండేవారికి తీరిక దొరికేది కేవలం ఆదివారం మాత్రమే. అయితే ఇలా పనుల్లో పడిపోయి మనలో చాలామంది  చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోతున్నారు. అలాంటి వారు కేవలం ఒక్కరోజులోనే ఈ వారం మొత్తం ఏయే క్రీడావిభాగాల్లో ఏం జరిగిందో  సమగ్ర సమాచారాన్ని ఈ వీక్లీ రౌండప్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇలా వారం రోజుల వార్తలను సంక్షిప్తంగా మీ ముందుంచేందుకు మీ, మా,మన ఆసియా నెట్  తెలుగు మీ  ముందుకు వీక్లీ రౌండప్ పేరుతో మీ ముందుకు  వచ్చింది.  

sports weekly roundup...asianet  news special
Author
Hyderabad, First Published Sep 8, 2019, 5:27 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

టీమిండియా బౌలర్ షమీపై అరెస్ట్ వారెంట్ జారీ...

 టీమిండియా బౌలర్ మహ్మద్ షమీ చుట్టు ఉచ్చు బిగుస్తోంది. గతకొంత కాలంగా షమీకి అతడి భార్య హసీన్ జహాన్ మధ్య వివాదం కొనసాగుతోంది. భర్తకు దూరంగా వుంటున్న హసీస్ షమీతో పాటు వారి కుటుంబ సభ్యులపై గృహహింస చట్టం కింద కేసు పెట్టింది. దీనిపై విచారణ జరుపుతున్న అలిపోర్ కోర్టు షమీతో పాటు అతడి సోదరుడు హసిద్ అహ్మద్ లను అరెస్ట్ చేయాల్సిందిగా పోలీసులను అదేశించింది.   


మాజీ క్రికెటర్ మునాఫ్ పటేల్ పై పోలీస్ కేసు నమోదు...
 
మాజీ క్రికెటర్ మునాఫ్ పటేల్ పై హత్యాయత్నం కేసు నమోదయ్యింది. అతడు తనను చంపడానికి ప్రయత్నిస్తున్నట్లు విదర్భ కు చెందిన  క్రికెట్ హిత్ రక్షక్ సంస్థ చీఫ్ దేవేంద్ర సుర్తి ఆరోపిస్తున్నారు. మునాఫ్ నుండి తనను కాపాడాలంటూ ఆయన నవాపురా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో  పోలీసులు మునాఫ్ పై కేసు నమోదు చేశారు. 


15ఏళ్ల క్రీడాకారిణిపై కోచ్ లైంగిక వేధింపులు

ఎంతో పవిత్రమైన టీచర్స్ డే రోజునే ఓ కీచక గురువు బాగోతం బయటపడింది. తనను ఎంతో గొప్ప క్రీడాకారిణిగా తీర్చిదిద్దుతాడని భావించిన గురువే ఆ చిన్నారిపై కన్నేశాడు. తన శిష్యులను...అందులోనూ కూతురు వయసుండే మైనర్ బాలికను లైంగికంగా వేదిస్తూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. ఇలా టీచర్స్ డే రోజునే గోవాకు చెందిన స్మిమ్మింగ్ కోచ్ సురజిత్ గంగూలీ బాగోతం బయటపడింది. 

కపిల్ దేవ్ రికార్డు బద్దలు...ఇషాంత్ న్యూ హిస్టరీ

 భారత్-వెస్టిండిస్ ల మధ్య జరుగుతున్న టెస్ట్ సీరిస్ ద్వారా టీమిండియా పేసర్ ఇషాంత్ శర్మ ఓ అరుదైన ఘనత సాధించాడు. లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ పేరిట వున్న రికార్డును ఇషాంత్ బద్దలుగొట్టాడు. ఉపఖండం బయట అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత బౌలర్ గా ఇషాంత్ శర్మ అవతరించాడు. ఉపఖండం బయట కపిల్ దేవ్ కేవలం 45 టెస్టుల్లోనే 155 వికెట్లను పడగొట్టగా ఇషాంత్ 156 వికెట్లను పడగొట్టి రికార్డు సృష్టించాడు. 


 రిటైర్మెంట్ పై వెనక్కి తగ్గిన రాయుడు...యూటర్న్ కాదట...  

తెలుగు క్రికెటర్ అంబటి  రాయుడు అంతర్జాతీయ క్రికెట్లో మళ్లీ పునరాగమనం చేశాడు. అయితే అతడు టీమిండియా సెలెక్టర్లను, భారత క్రికెట్ వ్యవస్థను తప్పుబడుతూ క్రికెట్ నుండి వైదొలిగాడు. కానీ తాజాగా తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కితీసుకుని టీమిండియా క్రికెటర్ గా కొనసాగడానికి సిద్దమయ్యాడు. దీంతో అతడిపై అభిమానులు సోషల్ మీడియా వేదికలపై ''యూటర్న్ రాయుడు'' అంటూ సెటైర్లు వేస్తున్నారు. దీంతో రాయుడు ఇలాంటి విమర్శలను తిప్పికొట్టే ప్రయత్నం చేశాడు. 

''నేను రిటైర్మెంట్ ని వెనక్కితీసుకుంటూ తీసుకున్న నిర్ణయం యూటర్న్ కాదు. దేశానికి తన సేవలను పరిపూర్ణంగా అందించాలనే ఈ నిర్ణయం తీసుకున్నాను. నాలో క్రికెట్ ఆడే సత్తా చాలా వుంది...దాన్ని కేవలం దేశానికే అందించాలని నిర్ణయించుకున్నా. కాబట్టే భారీ ఆఫర్లను సైతం వదులుకుని మళ్లీ రిటైర్మెంట్ పై వెనక్కితగ్గాను. అంతేకానీ దిక్కుతోచని పరిస్థితుల్లో మాత్రం ఇలా చేయలేదు.'' అంటూ  వివరణ ఇచ్చుకున్నాడు. 


తెలుగు క్రికెటర్ విహారీ వీరవిహారం 

తెలుగు క్రికెట్ ప్రియుల ఎన్నో ఏళ్ల ఎదురుచూపులకు హనుమ విహారీ తెరదించాడు. హైదరబాదీ సొగసరి బ్యాట్ మెన్ వివిఎస్ లక్ష్మణ్ తర్వాత టెస్ట్ క్రికెట్లో సెంచరీ బాదిన తెలుగు క్రికెటర్ గా హనుమ విహారి నిలిచాడు. వెస్టిండిస్ తో జరిగిన మొదటి టెస్ట్ లో తృటిలో సెంచరీని మిస్సైన విహారీ ఈసారి మాత్రం పట్టుదలతో ఆడి శతకాన్ని పూర్తిచేసుకున్నాడు. ఇలా తన కెరీర్లో మొదటి శతకాన్ని పూర్తిచేసుకున్నాడు. విహారీ 200 బంతుల్లో 100 పరుగులను పూర్తిచేసుకుని సత్తా చాటాడు.

 
రవిచంద్రన్ అశ్విన్...ఇకపై పంజాబ్ కాదు డిల్లీ

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టుకు గత రెండేళ్లుగా రవిచంద్రన్ అశ్విన్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. కానీ వచ్చే ఐపిఎల్ నుండి అతడు  డిల్లీ  పిటల్స్ జట్టులో కనిపించనున్నాడు. పరస్పర అంగీకారంతో అతన్ని డిల్లీ  క్యాపిటల్స్ జట్టు దక్కించుకుంది.     


టోక్యో ఒలింపిక్స్ కు ముందు భారత బాక్సింగ్ సమాఖ్య సంచలన నిర్ణయం
  
ప్రతిష్టాత్మక ఒలింపిక్స్ క్రీడలకు ముందు భారత బాక్సింగ్ సమాఖ్య సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ప్రొఫెషనల్ బాక్సర్లలకు దేశం తరపున ఆడేందుకు బీఎఫ్ఐ నిరాకరిస్తూ వస్తోంది. అయితే తాజాగా అలాంటి బాక్సర్లకు కూడా అధికారిక ఈవెంట్లలో పాల్గొనే అవకాశాన్ని కల్పిస్తూ బాక్సింగ్ సమాఖ్య నిర్ణయం తీసుకుంది. దీంతో చాలామంది ప్రొఫెషనల్ బాక్సర్లకు కేవలం తమకోసమే కాకుండా దేశం కోసం కూడా రింగ్ లో సత్తాచాటే అవకాశం లభించనుంది. 

ధోని రికార్డు బద్దలుగొట్టిన  రిషబ్ పంత్

 టీమిండియా-వెస్టిండిస్ ల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ ద్వారా పంత్ ఓ అరుదైన ఘనత సాధించాడు. అతి తక్కువ టెస్టుల్లోనే అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత వికెట్ కీపర్ గా పంత్ నిలిచాడు. అంతకుముందు ఈ రికార్డు ధోని పేరిట వుండగా దాన్ని పంత్ బద్దలుగొట్టాడు.  పంత్ కేవలం 11 టెస్టుల్లోనే 50 వికెట్లు పడగొట్టడంలోభాగస్వామ్యం వహించగా ధోని 15 టెస్టుల్లో ఈ ఫీట్ సాధించాడు. 


కోహ్లీసేన వెస్టిండిస్ పర్యటన సక్సెస్...టెస్ట్ సీరిస్ కూడా క్లీన్ స్వీపే  

వెస్టిండిస్ పరర్యటనను టీమిండియా విజయంతో మొదలుపెట్టి విజయంతోనే  ముగించింది. అసలు ఓటమన్నదే లేకుండా ఈ పర్యటనను ముగించింది. టీ20, వన్డే
సీరిస్ ల  మాదిరిగానే టెస్ట్ సీరిస్ ను కూడా కోహ్లీసేన క్లీన్ స్వీప్ చేసింది. రెండో  టెస్ట్ లో భారత్ నిర్దేశించిన 468 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక చతికిలపడింది. కొండంత లక్ష్యాన్ని మాత్రం ఛేదించలేక 210 పరుగులకే ఆలౌటయ్యింది. దీంతో భారత్ 257 పరుగులతో భారీ విజయాన్ని అందుకుంది. 

అప్ఘాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ అరుదైన రికార్డు

పరిమిత ఓవర్ల క్రికెట్ ఫార్మాట్లతో పాటు టెస్ట్ ఫార్మాట్ లో కూడా రషీద్ ఖానే కెప్టెన్. ఇలా అత్యంత చిన్న వయసులోనే కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్న అతడు ఓ అరుదైన రికార్డును నెలకొల్పాడు.  అంతర్జాతీయ టెస్ట్ ఫార్మాట్ లో అత్యంత చిన్న వయసులో(20 ఏళ్ల 350 రోజులు) కెప్టెన్ గా వ్యవహరించిన రికార్డును రషీద్ సొంతం చేసుకున్నాడు. ఇవాళ(గురువారం) బంగ్లాదేశ్ తో జరగనున్న ఏకైక టెస్ట్ మ్యాచ్ ద్వారా రషీద్ అప్ఘాన్ టీం కెప్టెన్సీ పగ్గాలను అందుకున్నాడు.

 
 స్మిత్ టెస్టుల్లో మాత్రమే...కానీ కోహ్లీ అన్ని ఫార్మాట్లలో

యాషెస్ సీరిస్ లో ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ అద్భత ప్రదర్శన చేస్తున్నాడు. వరుస సెంచరీలతో అదరగొడుతూ ఆతిథ్య ఇంగ్లాండ్ పై ఒంటరిగా పోరాటం చేస్తున్నాడు. సహచరుల నుండి సహకారం అందకున్నా గెలుపు కోసం పోరాడుతూ అభిమానుల మనసులను దోచుకుంటున్నాడు. ఈ క్రమంలోనే అతన్ని ఆసిస్ మాజీలు, అభిమానులు కొందరు వరల్డ్ నంబర్ వన్ బ్యాట్స్ మెన్ అంటూ ఆకాశానికెత్తేస్తున్నారు. అయితే మాజీ ఆసిస్ దిగ్గజం షేన్ వార్న్ మాత్రం ఈ వాదనను వ్యతిరేకిస్తూ సంచలనం సృష్టించాడు. 

ఓవైపు స్మిత్ ను గొప్ప టెస్ట్ బ్యాట్స్ మన్ అంటూనే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కంటే మాత్రం గొప్పవాడు కాదని వార్న్ అన్నాడు. కోహ్లీ కేవలం టెస్టుల్లోనే కాదు వన్డే, టీ20 ఫార్మాట్లలో కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేయగలడు. అందుకు అతడు అంతర్జాతీయ క్రికెట్లో సాధించిన రికార్డులే నిదర్శనమని అన్నాడు. కాబట్టి కోహ్లీతో పోల్చే స్థాయి స్మిత్ ది కాదంటూ వార్న్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. టెస్ట్ ర్యాకింగ్స్ లో కోహ్లీని వెనక్కినెట్టి స్మిత్ అగ్రస్థానాన్ని ఆక్రమించినప్పటికి వార్న్ ఈ వ్యాఖ్యలు చేశాడు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios