యువ క్రికెటర్లు పాండ్యా, కేఎల్ రాహుల్ లకు మరో అవకాశం ఇద్దామంటున్నారు టీం ఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ.  ఇటీవల కాఫీ విత్ కరణ్ టీవీ షోలో.. పాండ్యా, కేఎల్ రాహుల్ లు...మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి అడ్డంగా బుక్కయ్యారు. దీంతో.. బీసీసీఐ వీరిపై నిషేధం విధించింది. కాగా.. ఈ విషయంపై తాజాగా గంగూలీ స్పందించారు.

‘నిజమే..! పాండ్యా​, రాహుల్‌ మాటలు అభ్యతంరకరమైనవే. వారు మాట్లాడింది తప్పే. కానీ, మనమంతా మనుషులం. మెషీన్లం కాదు. మెషీన్‌ మాదిరిగా మనం ముందుగానే ఫిక్స్‌ చేసినట్టుగా అన్నీ పర్‌ఫెక్ట్‌గా జరగాలని లేదు. తీవ్ర విమర్శలతో వారిని మరింత బాధించొద్దు. చేసిన తప్పును తెలుసుకుని వారు కుమిలిపోతున్నారు. మళ్లీ అలాంటి తప్పు చేయరు. వారికొక అవకాశమిద్దాం. వారిపై విమర్శలతో ఇంకా రాద్ధాంతం చేయొద్దు.  మనం బతుకుదాం. ఇతరులకు బతకనిద్దాం’ అని వ్యాఖ్యానించారు.

మరి పాండ్యా, రాహుల్ విషయంలో గూంగూలీ ఇచ్చిన సలహాను బీసీసీఐ పాటిస్తుందో లేదా.. వారిపై నిషేధం మరికొంతకాలం పొడిగిస్తుందో వేచి చూడాల్సి ఉంది.