టీం ఇండియా ఓపెనర్ శిఖర్ ధావన్ మరోసారి నెటిజన్ల ట్రోలింగ్ బారిన పడ్డాడు. తమతోపాటు ఆట ఆడిన క్రికెటర్ పేరు మర్చిపోవడం.. ధావన్ ని చిక్కుల్లోకి పడేసింది.

ఇంతకీ మ్యాటరేంటంటే.. ప్రస్తుతం భారత్- ఆస్ట్రేలియాల మధ్య ఐదు వన్డేల మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిలో రెండు మ్యాచ్ లు భారత్ గెలవగా.. మరో రెండు మ్యాచ్ లు ఆసీస్ కైవసం చేసుకుంది. గెలుపుని నిర్దేషించే చివరి వన్డే.. ఢిల్లీలో జరగనుంది.

అయితే.. మొహాలీ వేదికగా జరిగిన నాల్గో వన్డేలో భారత్ పరుగుల వర్షం కురిపించినప్పటికీ.. మ్యాచ్ గెలుచుకోలేకపోయింది. ఈ మ్యాచ్ అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ధవన్ మాట్లాడుతూ ఆస్టన్ టర్నర్ ఆట తీరును ప్రశంసించాడు. అయితే ధవన్ ఎక్కడా కూడా టర్నర్ పేరును ప్రస్తావించలేదు. కేవలం ‘‘దట్ గాయ్’’ అంటూ మాత్రమే టర్నర్‌ను సంభోదించాడు. 

దీనికి సంబంధించిన వీడియోను ఆస్ట్రేలియన్ క్రికెట్ అధికారిక వెబ్‌సైట్‌లో ‘‘దట్‌గాయ్ ఎవరు’’ అంటూ ధవన్‌ను ఉద్దేశించి పోస్ట్ చేశారు. భారత్, ఆస్ట్రేలియా మధ్య మొహాలీలో జరిగిన నాలుగో వన్డేలో టర్నర్ 43 బంతుల్లో 84 నాలుగు పరుగులు చేసి ఆస్ట్రేలియా గెలుపులో కీలక పాత్ర పోషించాడు. 
దీంతో.. ఇప్పుడు ధావన్ అందరూ ట్రోల్ చేస్తున్నారు. ఆ దట్ గాయ్ ఎవరూ అంటూ కామెంట్స్ పెడుతూనే.. కొందరు తోటి క్రికెటర్ పేరు మర్చిపోయావా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి దీనిపై ధావన్ ఎలాంటి వివరణ ఇస్తారో చూడాలి.