చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు షేన్ వాట్సన్.. ప్రస్తుతం ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నాడు.  ఇటీవల హైదరాబాద్ వేదికగా జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ లో వాట్సన్ తమ జట్టు గెలుపు కోసం ఒంటరి పోరాటం చేశాడు. అతని మోకాలికి గాయం అయ్యి... రక్తం కారుతున్నా కూడా బ్యాట్ వదలలేదు. అతని నిబద్ధతను చూసి క్రికెట్ అభిమానులు ఫిదా అయ్యారు.

అతని అంకిత భావానికి సలాం చెప్పారు. సోషల్ మీడియా వేదికగా వాట్సన్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ఇప్పుడు ఐపీఎల్ ముగియడంతో వాట్సన్ కి కాస్త విశ్రాంతి దొరికినట్లు ఉంది. ఆ సమయాన్ని ఫామిలీకి కేటాయించాడు. 

ఇందులో భాగంగా తన ఫ్యామిలీతో కలిసి వాట్సన్ ఆటోలో చెన్నై నగరంలో షికార్లు చేశారు. ఈ ఫొటో ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌ అవుతోంది. వాట్సన్ ప్రయాణించేందుకు ఏసీ కార్లున్నప్పటికీ అతడు మాత్రం ఎంతో నిరాడంబరంగా ప్రయాణిస్తున్నాడంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.