కథువా రేప్ ఘటనపై క్రికెటర్ షమీ భార్య షాకింగ్ కామెంట్స్

Shami's wife shocking comments on Kathhua incident
Highlights

టీమిండియా ఫాస్ట్ బౌలర్ మొహమ్మద్ షమీ భార్య హసిన్ జహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

కోల్ కతా: టీమిండియా ఫాస్ట్ బౌలర్ మొహమ్మద్ షమీ భార్య హసిన్ జహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన విషయాన్ని ఆమె కథువా అత్యాచార ఘటనతో పోల్చుకున్నారు. కథువా బాధిత చిన్నారి కోసం బుధవారం సాయంత్రం ఓ ఎన్జీవో నిర్వహించిన శాంతి ర్యాలీలో ఆమె పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. కథువా కేసులో నిందితులు ఎంతటివారైనా శిక్ష పడాల్సిందేనని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకూడదని కోరుకుంటున్నానని ఆమె అన్నారు. 

ఆ రకంగా తాను కూడా కథువా తరహా బాధితురాలినే అని, కానీ ఆ చిన్నారి చనిపోయిందనీ తాను బతికి ఉన్నానని, కథువా ఘటనలో ఏమేం జరిగాయో అవన్నీ తన విషయంలోనూ జరిగాయని ఆమె అన్నారు. 

తనపై అత్యాచారం చేయాలని షమీ కుటుంబ సభ్యులు ప్రయత్నించారని, ఆ తర్వాత చంపేసి తన శవాన్ని చెత్తకుప్పలో వేయాలని అనుకున్నారని, రెండు నెలల పాటు షమీ కుటుంబ సభ్యులతో పోరాడి తాను ప్రాణాలతో బయటపడ్డానని అన్నారు.

loader