జర్మన్ క్రీడాకారుడికి మద్ధతు...క్రీడాకారిణిగా ఇలాంటి మాటలు వినలేను: సానియా

sania mirza supports germany football player ozil comments
Highlights

తాను జర్మనీ తరపున అంతర్జాతీయ ఫుట్‌బాల్ మ్యాచ్‌లు ఆడనని జర్మన్ ఫుట్‌బాల్ క్రీడాకారుడు మెసట్ ఒజిల్ వ్యాఖ్యలకు సానియా మిర్జా మద్ధతుగా నిలిచారు

తాను జర్మనీ తరపున అంతర్జాతీయ ఫుట్‌బాల్ మ్యాచ్‌లు ఆడనని జర్మన్ ఫుట్‌బాల్ క్రీడాకారుడు మెసట్ ఒజిల్ వ్యాఖ్యలకు సానియా మిర్జా మద్ధతుగా నిలిచారు. జట్టును గెలిపించినప్పుడు మాత్రమే జర్మన్‌గా గుర్తించడం.. ఓడిపోయినప్పుడు ఒక వలసదారుడి వల్లే ఓటమి జరిగిందంటూ ఒజిల్ కన్నీటి పర్యంతమవుతూ.. కేవలం టర్కీ మూలాలున్న కారణంగానే తనను విమర్శిస్తున్నారంటూ ఆరోపించాడు..

తాను దేశం తరపున ఎన్నో విజయాల్లో కీలకపాత్ర పోషించినప్పటికీ తనపై విమర్శలు చేస్తున్నారని...జాతి వివక్షకు వ్యతిరేకంగా తాను జర్మనీ తరపున ఫుట్‌బాల్ ఆడనంటూ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అతని నిర్ణయానికి మద్దతుగా భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా స్పందించింది. ‘‘ ఒక క్రీడాకారిణిగా.. ఒక మనిషిగా ఇలాంటి వార్తలు వినాల్సి రావడం చాలా బాధ కలిగిస్తోందని.. జాత్యహంకారం అసలు ఉండకూడదని.. దానిని ఎట్టి పరిస్ధితుల్లోనూ అంగీకరించనని ’’ సానియా ట్వీట్ చేశారు.

loader