ఆస్ట్రేలియాతో శుక్రవారం జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో అద్భుతమైన ఆటతీరుతో టీమిండియా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను 2–1తో గెలుచుకొని కోహ్లి బృందం సత్తాను చాటింది. దీంతో..ఆస్ట్రేలియా గడ్డపై  చరిత్ర సృష్టించిన టీం ఇండియా పై ప్రశంసల వర్షం కురుస్తోంది.  

తాజాగా.. టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సతీమణి సాక్షి ధోనీ.. సోషల్ మీడయాలో అభినందనలు తెలిపారు. టీం ఇండియా చారిత్రాత్మక విజయాన్ని సాధించారని ఆమె అన్నారు. ఈ సందర్భంగా ఆమె టీం ఇండియాకి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మ్యాచ్ గెలిచి దేశం గర్వపడేలా చేశారని ఆమె పేర్కొన్నారు. సైకికుల్లా కష్టపడి విజయం సాధించారంటూ ఇన్ స్టాగ్రామ్ లో ఆమె మెసేజ్ చేశారు.