టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ భార్య సాక్షి పై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఎంతో గొప్ప మనసు ఉన్న ధోనీకి.. కాస్త గౌరవం ఇవ్వూ అంటూ నెటిజన్లు ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు.

ఇంతకీ మ్యాటరేంటంటే... ధోనితో సాక్షి చెప్పులు తొడిగించుకుంటూ ఉన్న ఫోటోని తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన సంగతి తెలిసిందే. ‘‘బిల్ నువ్వే కట్టావ్ గా.. చెప్పులు కూడా నువ్వే వెయ్యి’’ అనే క్యాప్షన్ తో సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫోటో చూసి నెటిజన్లు.. ఒక్కొక్కరు ఒక్కో రకంగా స్పందిస్తున్నారు. కొందరు.. ధోనికి తన భార్యపై ఉన్న ప్రేమను గొప్పగా వర్ణిస్తుంటే.. మరికొందరు మాత్రం సాక్షి చేసిన పనికి మండిపడుతున్నారు.

ధోని గౌరవాన్ని పాడుచేస్తోందంటూ.. సాక్షిపై కొందరు నెటిజన్లు తిడ్ల దండకం మొదలెట్టేశారు. ‘‘ మంచి మనసు ఉన్న ధోనికి నువ్వు అనర్హురాలివి. పబ్లిక్ గా ఓ దిగ్గజ క్రికెటర్ తో చెప్పులు వేయించుకుంటావా?’’ అని ఒకరు మెసేజ్ చేయగా...‘‘ఇది పద్దతి కాదు ధోనీ.. గొప్ప క్రికెటర్ అన్న విషయం మర్చిపోకండి. మీరు సేవకుడు కాదు’ అంటూ కొందరు.. ‘‘సాక్షి నువ్వు ధోనీకి కాస్త గౌరవాన్ని ఇవ్వు’’ అంటూ మరికొందరు అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

సంబంధిత వార్తలు ఇక్కడ చదవండి

అక్కడ కెప్టెన్సీ చెల్లదు : భార్యకి చెప్పులు తొడిగిన ధోనీ