ఆసియా క్రీడల్లో కాంస్యం గెలిచిన సైనాకు తండ్రి కానుక

https://static.asianetnews.com/images/authors/26af83d2-0ed6-5e66-b49b-5078caf01292.jpg
First Published 30, Aug 2018, 12:13 PM IST
Saina Nehwal receiving special gift from father
Highlights

ఇండోనేషియాలోని జకర్తాలో జరుగుతున్న 18వ ఆసియా క్రీడల్లో మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్ విభాగంలో సైనా నెహ్వాల్ కాంస్యం గెలిచిన సంగతి తెలిసిందే. చివరి వరకు పోరాడిన సైనా కాంస్యంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 

ఇండోనేషియాలోని జకర్తాలో జరుగుతున్న 18వ ఆసియా క్రీడల్లో మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్ విభాగంలో సైనా నెహ్వాల్ కాంస్యం గెలిచిన సంగతి తెలిసిందే. చివరి వరకు పోరాడిన సైనా కాంస్యంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆమె ఆట తీరును అభిమానులతో పాటు క్రీడా పండితులు కొనియాడారు.

ఈ నేపథ్యంలో తన ముద్దుల కూతురికి ఆమె తండ్రి హర్వీర్ సింగ్ కానుక అందజేశారు. తెలుపు రంగు రాళ్లు పొదిగిన ఉంగరాన్ని ఆయన సైనా నెహ్వాల్‌కు బహుకరించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను సైనా సోషల్ మీడియాలో పంచుకుంది. ‘‘ ఆసియా క్రీడల్లో కాంస్య పతకం గెలిచినందుకు నా తండ్రి హర్వీర్ సింగ్ నాకు ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్.. అని ఆమె ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
 

loader