బ్యాట్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ ఆరోగ్యం క్షీణించింది. ఆమె గత కొంతకాలంగా కడుపులో నొప్పితో బాధపడుతున్నారు. దీంతో ఆమె స్విస్ ఓపెన్ నుంచి వైదొలిగారు. స్విస్‌ ఓపెన్‌లో పాల్గొనడానికి వెళ్లిన సైనాకు కడుపు నొప్పి తీవ్రంగా కావడంతో ఆస్పత్రికి వెళ్లారు. దాంతో ఆమెను పరీక్షించిన వైద్యులు కొన్ని రోజులు ఆస్పత్రిలోనే ఉండి చికిత్స తీసుకోవాలని సూచించారు. ఈ విషయాన్ని బుధవారం తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ పేజీలో సైనా పోస్ట్‌ చేశారు.

‘ఇది నిజంగానే నాకు చేదు వార్త. గత సోమవారం నుంచి తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతున్నా. ఆల్‌ ఇంగ్లండ్‌ ఛాంపియన్‌షిప్‌లో నొప్పితోనే కొన్ని మ్యాచ్‌లాడా. నొప్పి ఎక్కువవడంతో స్విస్‌ ఓపెన్‌లో పాల్గొనకుండా స్వదేశం వచ్చేశా. వైద్యులు ఆసుపత్రిలో చేరాలని సూచించారు. అన్నాశయ సంబంధిత సమస్యగా చెప్పారు. త్వరలోనే కోలుకుంటాననే నమ్మకంతో ఉన్నా’ అని సైనా అని తెలిపారు.