క్రికెట్ దిగ్గజం, మాష్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ 46వ పుట్టిన రోజు జరుపుకున్న సంగతి తెలిసిందే. ఆయనకు క్రికెటర్లు, సెలబ్రెటీలు.. దేశవ్యాప్తంగా అభిమానులు ఆయనపై శుభాకాంక్షల వెల్లువ కురిపించారు. కాగా.. తనకు విషెస్ చెప్పిన వారికి సచిన్ థ్యాంక్స్ కూడా తెలియజేశారు. ఈ క్రమంలో.. తన స్నేహితుడు వినోద్ కాంబ్లీ ని ట్రోల్ చేశారు.

సచిన్ పుట్టిన రోజు సందర్భంగా.. వినోద్ కాంబ్లి.. వినూత్నంగా బర్త్ డే విషెస్ చెప్పారు. బాలీవుడ్ సినిమాలోని ఓ పాటను సచిన్ కోసం పాడి.. బర్త్ డే విషెస్ చెప్పారు. ఆ వీడియోని చూసి.. వినోద్ ని అందరూ అభినందించారు కూడా. పాట చాలా బాగా పాడారు సర్ అంటూ కామెంట్ల వర్షం కురిపించారు. వినోద్ కాంబ్లి, సచిన్ కి సంబంధించిన పాత ఫోటోలను నెట్టింట  షేర్ చేశారు కూడా.

తాజాగా.. వినోద్ కాంబ్లి పాడిన పాటకి సచిన్ స్పందించారు. తన కోసం అద్భుతంగా పాటపాడినందుకు థ్యాంక్స్ చెప్పారు. అనంతరం కాంబ్లి లుక్ పై కామెంట్ చేశారు. ‘‘ నాకిప్పటికీ ఆశ్చర్యంగానే ఉంది.. నీ గడ్డం తెల్లగా మారినా.. నీ కనుబొమ్మలు మాత్రం నల్లగానే ఎలా ఉన్నాయా’’ అని  కామెంట్ వేశాడు.

సచిన్ కామెంట్ కి నెటిజన్లు బాగా స్పందించారు. ప్రస్తుత డిజిటల్ కాలంలో ఎలాంటివైనా సాధ్యమే సచిన్ సర్ అంటూ.. నెటిజన్లు  స్పందిస్తున్నారు. ఇప్పుడు ఈ టాపిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.