ఇండియన్ క్రికెటర్, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ కి అరుదైన గౌరవం దక్కింది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్( ఐసీసీ) హాల్ ఆఫ్ ఫేమ్ లో సచిన్ కి చోటు దక్కింది. సచిన్ తోపాటు దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ అలన్ డోనాల్డ్, ఆస్ట్రేలియా మాజీ మహిళా క్రికెటర్ క్యాథిరిన్ లకు కూడా ఈ అవకాశం దక్కింది. ఐసీసీ స్వయంగా ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా ప్రకటించింది.

లండన్ లో నిర్వహించిన ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ కార్యక్రమంలో సచిన్ పాల్గొని మాట్లాడారు. తనకు ఈ గుర్తుంపు లభించడం పట్ల చాలా సంతోషంగా ఉన్నట్లు చెప్పారు. ఇది చాలా గౌరవంగా భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

సచిన్ కి ఈ గౌరవం లభించడం పట్ల ఐసీసీ కూడా స్పందించింది.  అంతర్జాతీయ క్రికెట్ లో అటు టెస్టులు, ఇటు వన్డేల్లో అత్యధిక పరుగులతోపాటు వంద సెంచరీలు సాధించిన ఏకైక క్రికెటర్ సచిన్ అని పేర్కొంది. లెజెండ్ అనే పదం సచిన్ కి చాలా తక్కువ అని పేర్కొంది. తాజాగా సచిన్ కి ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ లో చోటు కల్పించాం అంటూ ఐసీసీ ట్వీట్ చేసింది. ఈ  సందర్భంగా సచిన్ కి పలువురు క్రికెటర్లు అభినందనలు తెలుపుతున్నారు.

ఈ గౌరవం దక్కిన ఆరో ఇండియన్ క్రికెటర్ గా సచిన్ ఘనత సాధించారు. సచిన్ కన్నా ముందు బిషన్ సింగ్ బేడీ(2009), సునీల్ గవాస్కర్(2009), కపిల్ దేవ్(2009), అనిల్ కుంబ్లే(2015, రాహుల్ ద్రవిడ్(2018) లు ఈ ఘనత సాధించారు.