వారెవ్వా రష్యా.. స్పెయిన్‌ను ఇరగదీసిందయ్యా..(వీడియో)

Russia beat Spain
Highlights

4-3తో గెలుపు.. క్వార్టర్స్ ఫైనల్స్‌కు చేరిక...

హైదరాబాద్: ఫిఫా ఫుట్‌బాల్ టోర్నమెంట్ హోస్ట్ రష్యా ఆదివారం హిస్టరీ క్రియేట్ చేసింది. ప్రీ క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్‌లో స్పెయిన్‌ను చిత్తుగా ఓడించింది. అసలు గ్రూప్ స్టేజ్ దాటుతుందా అని అందరూ భావిస్తున్న రష్యా సరాసరి క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకుంది. పెనాల్టీ షూటౌట్ హోస్ట్ టీమ్‌కు కలిసివచ్చింది. 

మ్యాచ్ ఆరంభం నుంచి రష్యా, స్పెయిన్ జట్లు నువ్వా నేనా అన్న రీతిలో తలపడ్డాయి. ఆట మొదలైన కొద్దిసేపటికే బాల్‌‌పై నియంత్రణ సాధించిన స్పెయిన్ రష్యా గోల్ పోస్ట్‌పై ఎదురు దాడి మొదలుపెట్టింది. 12వ నిముషంలో రష్యా ప్లేయర్ ఇగ్నాషెవిచ్ సెల్ఫ్ గోల్ చేసి స్పెయిన్‌కు ఆధిక్యాన్ని ఇచ్చాడు. 41వ నిముషంలో రష్యాకు పెనాల్టీ లభించింది. ఫార్వర్డ్ జ్యూబా దానిని గోల్‌గా మార్చి స్కోరును 1-1తో సమం చేశాడు. అలా మ్యాచ్ ఫస్టాఫ్ 1-1తో ముగిసింది. 

సెకండాఫ్ కూడా ఒక్క గోల్ కూడా చేయకుండా హోరాహోరీగా సాగింది. నిర్ణీత సమయం ముగిసేసరికి స్కోరు 1-1 గా ఉంది. దీంతో ఆటకు అదనంగా 22 నిముషాల సమయం వచ్చింది. అదనపు సమయంలోనూ రెండు జట్లు హోరాహోరీగా ఆడటంతో పరిస్థితిలో ఎలాంటి మార్పు కనిపించలేదు. 

దీంతో పెనాల్టీ షూటౌట్‌ను ప్రకటించారు. ఇందులో 4-3తో స్పెయిన్‌ను చిత్తు చేసింది. సరాసరి క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకుంది. రష్యా గోల్ కీపర్ ఈగర్ అకిన్‌ఫీవ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.

"

loader