టీం ఇండియా యువ క్రికెటర్ కేదార్ జాదవ్ కి బాలీవుడ్ సినిమాలో ఆఫర్ వచ్చిందా? ప్రస్తుతం ఆ సినిమా కథ ను జాదవ్ ఇంకా ఫైనల్ చేయలేదట. అదేంటి..? క్రికెట్ వదిలేసి సినిమాల్లోకి వెళ్తున్నాడేంటి అనుకుంటున్నారా...? నిజంగా సినిమాలో నటించే ఆఫర్ రాలేదు. కేవలం తన సహచర క్రికెటర్లు... జాదవ్ ని ఇలా టీజ్ చేశారు. కాగా... దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ గా మారింది.

పూర్తి వివరాల్లోకి వెళితే...  మరో రెండు రోజుల్లో వరల్డ్ కప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో... టీం ఇండియా విదేశీ పర్యటనకు వెళ్లారు.  మ్యాచ్‌ కోసం లండన్‌ నుంచి కార్డిఫ్‌కు బస్సులో బయల్డేరిన టీమిండియా ఆటగాళ్లు ఈ ప్రయాణాన్ని తమదైన శైలిలో ఆస్వాదించారు. టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ ఈ జర్నీకి సంబంధించిన ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పంచుకోగా.. అది ప్రస్తుతం తెగ వైరల్‌ అయింది. సహచర ఆటగాళ్లు రవీంద్ర జడేజా, కేదార్‌జాదవ్‌లతో కబుర్లు చెబుతూ.. జోక్స్‌ వేసుకున్న విధానం అభిమానులను ఆకట్టుకుంటోంది.
 
‘హే గాయ్స్‌.. మేం లండన్‌ నుంచి కార్డిఫ్‌ వెళ్తున్నాం. ఒక్కసారి ఇక్కడి అందమైన లొకేషన్స్‌ చూడండి. నాకు కంపెనీగా ఇద్దరు జెంటిల్‌మెన్స్‌ రవీంద్ర జడేజా.. కేదార్‌ జాదవ్‌లు ఉన్నారు. జడ్డూ నీవు మొన్న మస్త్‌ ఆడినవ్‌ యార్‌.’ అని రోహిత్‌ అనగా.. ‘థ్యాంక్స్‌ రోహిత్‌! కఠిన పరిస్థితుల్లో రాణించడం గొప్ప అనుభూతినిచ్చింది. ఈ టోర్నీలో మన జట్టు కూడా ఇలానే రాణిస్తుందని ఆశిస్తున్నాను’ అని జడేజా సమాధానం ఇవ్వగా.. ‘అవును మనం రాణిస్తాం. ఈ ప్రపంచకప్‌ మనకు చాలా ముఖ్యం’ అని రోహిత్‌ వ్యాఖ్యానించాడు. 

అనంతరం పక్కనే ఉన్న జాదవ్‌పై రోహిత్‌ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.. ‘జడ్డూతో కూర్చున్న ఈ వ్యక్తి రేస్‌ 4 యాక్టర్‌ కేదార్‌ జాదవ్‌. కేదార్‌.. నీ అందానికి, నీలోని ప్రత్యేకతకు బాలీవుడ్‌ మూవీ రేస్‌ 4 చిత్రంలో అవకాశం వచ్చిందంట కదా’ అని రోహిత్‌ టీజ్‌ చేయగా.. ‘ఇంకా అది ఫైనల్‌ కాలేదు. ఇంకా చర్చలు జరుగుతున్నాయి. రెండు నెలల తర్వాత మీరంతా ఆశ్చర్యపోవచ్చు’ అంటూ జాదవ్‌ స్పాంటినేయస్ గా సమాధానమివ్వడం విశేషం.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Bus drives are fun! PS - listen carefully! @kedarjadhavofficial @royalnavghan

A post shared by Rohit Sharma (@rohitsharma45) on May 26, 2019 at 6:54am PDT