ఏషియన్ గేమ్స్: భారత్ ఖాతాలో ఆరో స్వర్ణం

https://static.asianetnews.com/images/authors/3800b66b-dc46-549b-a35e-91a1dbfb7895.jpg
First Published 24, Aug 2018, 1:02 PM IST
Rohan Bopanna-Divij Sharan Clinch Gold Medal In Men's Doubles Tennis
Highlights

ఆసియా దేశాల మధ్య జరుగుతున్న క్రీడా సమయంలో భారత క్రీడాకారులు చెలరేగిపోతున్నారు. ఇప్పటివరకు ఈ క్రీడల్లో భారత్ 23 పతకాలను( 6 స్వర్ణం, 3 సిల్వర్, 14 కాంస్యం) తన ఖాతాలో వేసుకుంది. 

ఆసియా దేశాల మధ్య జరుగుతున్న క్రీడా సమయంలో భారత క్రీడాకారులు చెలరేగిపోతున్నారు. ఇప్పటివరకు ఈ క్రీడల్లో భారత్ 23 పతకాలను( 6 స్వర్ణం, 3 సిల్వర్, 14 కాంస్యం) తన ఖాతాలో వేసుకుంది. ఇప్పటివరకు షూటింగ్, రెజ్లింగ్ వంటి క్రీడల్లో సత్తా చాటి భారీగా పతకాలు కైవసం చేసుకున్నారు. ఇక ఇప్పుడు టెన్నిస్ లో విజయాలు సాధిస్తూ పతకాల వేట మొదలైంది.  ఇప్పటికే మహిళా టెన్నిస్ విభాగంలో ఓ కాంస్య పతకం భారత్ ను వరించగా, పురుషుల డబుల్స్ లో తాజాగా స్వర్ణం దక్కింది. 

టెన్నిస్‌ పురుషులు డబుల్స్ ఫైనల్లో రోహన్ బోపన్న- దివిజ్ శరన్ అద్భుత ఆటతీరును కనబర్చారు.  ఈ జంట తుది పోరులో ఖజకిస్తాన్ టెన్నిస్ క్రీడాకారులు బబ్లిక్‌-డెనిస్‌ జోడీపై 2-0 తేడాతో  గెలిచి స్వర్ణం సాధించారు. తొలి సెట్‌ను 6-3 తేడాతో గెలిచిన భారత జోడి, రెండో సెట్‌ను 6-4తో సొంతం చేసుకుని తిరుగులేని ఆధిక్యాన్ని కనబర్చారు. దీంతో భారత్ కు మరో స్వర్ణం కైవసమైంది.   

భారత టెన్నిస్ క్రీడాకారిణి అంకిత రైనా ఇప్పటికే మహిళా సింగిల్స్ విభాగంలో కాంస్యం సాధించారు. తాజాగా బోపన్న-శరన్ జోడి తాజాగా స్వర్ణం సాధించడంతో టెన్నిస్ విభాగంలో పతకాల సంఖ్య 2 కు చేరింది. ఈ విభాగంలో భారత్ మరిన్ని పతకాలను ఆశిస్తోంది.  

loader