బేబీ సిట్టర్... టీంఇండియా ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా బాగా ప్రాచుర్యం పొందిన పదం. ఏకంగా ఆస్ట్రేలియా ప్రధాని కూడా ఈ బేబీసిట్టింగ్ స్లెడ్జింగ్ గురించి ప్రస్తావించాడంటేనే ఆ పదం ఎంతగా పాఫులర్ అయ్యిందో అర్థమవుతుంది. అయితే  ఆస్ట్రేలియా పర్యటన ముగిసినా ఈ బెబీ సిట్టింగ్ పై ప్రచారం కొనసాగుతూనే వుంది.

మరొకొద్దిరోజుల్లో ఆస్ట్రేలియా జట్టు భారత్‌లో  పర్యటించనున్న నేపథ్యంలో స్టార్‌ స్పోర్ట్స్‌ ఈ బేబీ సిట్టింగ్ వ్యవహారంతో ఓ యాడ్ ను రూపొందించింది. దీంతో ఈ యాడ్  రూపంలో మరోసారి బేబీ సిట్టింగ్ పదం పాపులర్ అవుతోంది. అంతేకాదు ఆస్ట్రేలియా, టీంఇండియా క్రికెటర్లు ఈ యాడ్ పై స్పందిస్తుండటంతో మరింత పాపులారిటీ లభిస్తోంది. 

టీంఇండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆస్ట్రేలియా జెర్సీ ధరించిన చిన్నారులను ఆడిస్తున్నట్లు ఓ యాడ్ ను రూపొందించారు. తాజాగా ఈ యాడ్ పై బేబీ సిట్టింగ్ పదం ఇంత పాపులర్ అవ్వడానికి కారణమైన టీంంఇండియా యువ క్రికెటర్ రిషబ్ పంత్ స్పందించాడు. ''వీరూ పాజీ మంచి బేబీ సిట్టర్ మరియ అంతకంటే మంచి ఆటగాడిగా  ఎలా  వుండాలో చూపించారు...ఈ విషయంలో ఆయనే తమకు ఆదర్శం'' అంటూ పంత్ ట్వీట్ చేశాడు. 

అయితే ఈ యాడ్ పై ప్రస్తుతం వివాదం చెలరేగుతోంది. ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు మాథ్యూ హెడెన్ తో పాటు ఇతర మాజీలు, ఆటగాళ్లు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆసీస్ జెర్సీలతో యాడ్ చేయడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఆస్ట్రేలియా జట్టును అంత తక్కువగా అంచనా వేయకూడదంటూ హెడెన్ హెచ్చరించాడు. 

ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా భారత యువ క్రికెటర్ రిషబ్ పంత్ ను రెచ్చగొట్టడానికి ఆసిస్ కెప్టెన్ టిమ్ ఫైన్ స్లెడ్జింగ్ కు పాల్పడిన విషయం తెలిసిందే. తర్వాతి మ్యాచులకు వికెటర్ కీఫర్ ధోని జట్టులోకి వస్తాడు కాబట్టి నువ్వు బయటకు వెళ్లాల్సి వుంటుందంటూ పంత్ ను రెచ్చగొట్టాడు. అంతేకాకుండా ఫైన్ తన భార్యను తీసుకుని బయటకు వెళతానని...ఆ సమయంలో నువ్వు తమ పిల్లలను ఆడిస్తావా అంటూ ఎగతాళి చేశాడు. ఆ తర్వాత ఓ సందర్భంలో టిమ్ ఫైన్ భార్యా పిల్లలను పంత్ కలుసుకున్నాడు. ఈ సందర్భంగా ఫైన్ భార్య పంత్ ను మంచి బేబీ సిట్టర్ అంటూ పొగిడారు. దీంతో ఈ బేబీ సిట్టింగ్ అనే పదానికి పాపులారిటీ వచ్చింది.   

వీడియో