ఐపీఎల్ మ్యాచ్ లో క్రికెటర్లు తమ ప్రతిభంతా చూపించి...సత్తా చాటుతుంటే... ఓ యువతి మాత్రం కేవలం తన లుక్స్ తో... రాత్రికి రాత్రే స్టార్ స్టేటస్ ని సంపాదించుకుంది. అప్పుడెప్పుడో ప్రియా ప్రకాశ్ వారియర్ కన్ను కొట్టి... ఫేమస్ అయిపోయినట్లు.. ఈ అమ్మాయి ఆర్సీబీపై తనకు ఉన్న అభిమానంతో ఫేమస్ అయిపోయింది. 

ఇంతకీ మ్యాటరేంటంటే... శనివారం చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్‌ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. కాగా ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ ని ఆర్సీబీ చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ విజయం కన్నా... జనాలు ఆర్సీబీ ఫ్యాన్ గర్ల్ పైనే ఎక్కువ దృష్టి పెట్టారు.

మ్యాచ్ గెలిచిన తర్వాత కెమెరాలు ఈ అమ్మడిని స్క్రీన్‌పై చూపించడంతో ఆమె చేష్టలకు సోషల్ మీడియాలో నెటిజన్స్ అంతా ఫిదా అయిపోయారు. ఆర్సీబీకి మద్దతుగా వచ్చిన ఆ యువతి మ్యాచ్ జరిగినంత సేపు గ్యాలరీలో తన తోటి ప్రేక్షకులతో కలిసి సందడి చేసింది.

దీంతో మ్యాచ్ ముగిసిన అనంతరం ఇంటర్నెట్‌లో ఎవరీ మిస్టరీ గర్ల్? అంటూ నెటిజన్స్ శోధించడం చేయడం మొదలు పెట్టారు. తన ఇన్స్‌టాగ్రామ్‌లో చేసిన పోస్ట్ ద్వారా ఆమె పేరు దీపిక ఘోష్‌గా గుర్తించారు. దాంతో యువతి అందాన్ని ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో నెటిజన్లు తెగ కామెంట్లు పెడుతున్నారు.ఇప్పుడు ఆమె ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ లలో ఫాలోవర్స్ లక్షల్లో పెరిగిపోయారు. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

#RCB girl forever ❤️🏏

A post shared by deepika (@deeghose) on May 4, 2019 at 12:51pm PDT