మరో టెన్నిస్ సూపర్ స్టార్ పెళ్లి పీటలు ఎక్కేందుకు రెడీ అయ్యారు. ఇప్పటికే అంతర్జాతీయ పురుషుల టెన్నిస్‌ బిగ్‌–4లో రోజర్‌ ఫెడరర్, నొవాక్‌ జొకోవిచ్, ఆండీ ముర్రే ఇప్పటికే పెళ్లి చేసుకున్నారు. ఈ జాబితాలో చివరివాడైన స్పెయిన్‌ స్టార్‌ రాఫెల్‌ నాదల్‌  కూడా వివాహానికి సిద్ధమయ్యారు. 

 తన ప్రియురాలు ఫ్రాన్సెస్కా పెరెల్‌నుఈ ఏడాది నాదల్‌ వివాహం చేసుకోనున్నట్లు  స్పెయిన్‌కు చెందిన హోలా మేగజైన్‌ కథనాన్ని ప్రచురించింది.14 ఏళ్లుగా వీరి మధ్య ప్రేమాయణం సాగుతుండగా... గతేడాది మే నెలలో ఫ్రాన్సెస్కాకు నాదల్‌ పెళ్లి ప్రతిపాదన చేసినట్లు సమాచారం.  ఇటీవలే వీరి ఎంగేజ్ మెంట్ కూడా అయ్యింది.

ఈ ఏడాది ఆస్ట్రేలియా ఓపెన్ ణు తన ఖాతాలో వేసుకున్న నాదల్ ఇప్పటి వరకు మొత్తం 17 గ్రాండ్ స్లామ్ లను సొంతం చేసుకున్నాడు.