ఏది గెలుపు ఏది ఓటమి అసలు వీటిని నిర్ణయించేది ఎవరు. ఆటను కోల్పోయినంత మాత్రాన అది ఓటమి కాదు తను విజయం సాధించాలని చేసిన ప్రయత్నంలో తనుగెలిచినట్లే లెక్క. ఇప్పుడు  ఇవన్ని ఎందుకు అంటున్నారా! తాజాగా మన తెలుగు తేజం పివి సింధు ఓటమిలపై అభిమానులు  తెగ బాధపడిపోతున్నారు. 

ఒలింపిక్స్‌లో రజతం.. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో రజతం..బీడబ్ల్యూఎఫ్‌ ప్రపంచ టూర్‌ ఫైనల్స్‌ టైటిల్‌ సైతం  నెగ్గి ఈ ఘనత సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా నూతన అధ్యాయం లిఖించింది మన సింధూ. అయితే తాజా ఓటమి అభిమానులను నిరాశపరుస్తుండడంతో దీనిపై ఆమె కోచ్ పుల్లేల గోపిచంద్ స్పందించారు.

also read: Pink Ball: ఇప్పుడైతే ఆసీస్ లోనూ ఆడుతామంటున్న కోహ్లీ

తీరికలేని షెడ్యూల్,  టోర్నీస్ కోసం ఆమె చేస్తున్న ప్రయణాల కారణంగానే సింధు ఆటలో వైఫల్యం చెందుతుందని అన్నారు. ఆగస్టులో ప్రపంచ చాంపియన్‌షిప్‌ టైటిల్‌ నెగ్గిన సింధూ ఆ తర్వాత జరిగిన టోర్నీలలో అనుకున్నంతగా ఆడకపోవడంతో ఆమెలో కొంత నైరాశ్యం మెుదలైంది. 

దీనిపై ఆమె కోచ్ గోపీచంద్ క్లారీటీ ఇచ్చారు. తీరక లేని షెడ్యూల్ కారణంగానే ఆమె తను అనుకున్నంతగా రాణించలేకపోతున్నారన్నారు.  త్వరలోనే ఆమె గెలుపు బాట పడుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. సింధూ  ఓటములపై మీడియాతో మాట్లాడుతూ " ఆగస్టు జరిగిన వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ టోర్నీ తర్వాత  సింధూకు విరామం  లేకుంగా పోయింది.

అదే పనిగా  చైనా, కొరియా, డెన్మార్క్, హాంకాంగ్‌లో జరిగిన టోర్నీల కోసం ఆమె సుధూర  ప్రయాణాలను చేయావల్సి వచ్చింది. దీంతో  ఆ టోర్నీలలో  సింధూ అనుకున్నంతగా రాణించలేక పోయారు. సింధూతో పాటు  ఇతర ప్రంపచ స్ధాయి ఆటగాళ్ళు కూడా  ఇలాంటి ఓత్తిడినే ఎదుర్కొంటున్నారు. త్వరలోనే తిరిగి గెలుపు బాట పడుతుందన్నారు"

also read:బంతిని షైన్ చేయొద్దన్నందుకు: గ్రౌండ్‌లోనే సహచరుడిని లాగి కొట్టిన క్రికెటర్

శుక్రవారం ఈడెన్‌ గార్డెన్స్‌లో భారత్, బంగ్లాదేశ్‌ జట్ల మధ్య  డేనైట్‌ టెస్టు  ప్రారంభ కానున్న నేపథ్యంలో ప్రముఖ క్రీడాకారులను బీసీసీఐ సత్కరించనున్నది.
ఆ అటగాళ్ళ జాబితిలో కోచ్ గోపీచంద్‌తో పాటు పీవీ సింధు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా కోల్ కతాకు వచ్చిన వారు మీడియాతో మాట్లాడారు.