బ్యాంకాక్: థాయ్‌లాండ్ ఓపెన్‌ టోర్నమెంటులో భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిమి పీవీ సింధుకి నిరాశే మిగిలింది. భారీ అంచనాలతోఫైనల్‌లోకి అడుగుపెట్టిన సింధు జపాన్ షట్లర్ నజొమి ఒకుహరా చేతిలో పరాజయం పాలైంది. 

ఈ మ్యాచ్‌లో తొలి సెట్‌లో ఒకుహరా దూకుడుగా ఆడింది. సింధుకు ఊపిరి సలపనీయకుండా పాయింట్లు సాధించింది. తొలి సెట్‌ని 21-15 తేడాతో కైవసం చేసుకుంది. రెండో సెట్‌లో ఇరువురు క్రీడాకారిణిలు పోటాపోటీగా తలపడ్డారు. 

ఒకదశలో సింధు ఆధిక్యంలోకి వచ్చింది. దీంతో ఒకుహరా దూకుడు పెంచింది. అప్పటి నుంచి సింధుకి ఎటువంటి అవకాశాన్ని ఇవ్వకుండా పాయింట్ల సాధించింది. ఫలితంగా రెండో సెట్‌ని 21-18 తేడాతో చేజిక్కించుకుని విజయం సాధించింది. 

ఇప్పటివరకూ సింధు ఒకుహరా చేతిలో ఆరుసార్లు ఓడిపోయింది. కాగా ఈ ఏడాది ఇది సింధుకి మూడో రజత పతకం.