ప్రో కబడ్డి లీగ్ సీజన్-7 లో డిపెండింగ్ ఛాపింయన్ బెంగళూరు బుల్స్ కు శుభారంభం లభించింది. కేవలం రెండు పాయింట్స్ తేడాతో పాట్నా పైరేట్స్ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఫస్ట్ ఆఫ్ లో 13-17తో వెనుకబడ్డప్పటికి సెంకండాఫ్ లో పుంజుకుని బెంగళూరు జట్టు 2 పాయింట్స్( 34-32) తేడాతో విజేతగా నిలిచింది.

బెంగళూరు బుల్స్ కు రైడర్లు 17 పాయింట్లు సాధించింది. అలాగే టాకిల్స్ ద్వారా 15, ఆలౌట్ ద్వారా మరో 2 పాయింట్లతో మొత్తం 34 పాయింట్లతో విజయాన్ని అందుకుంది.  ఆటగాళ్ల విషయానికి వస్తే రైడర్ పవన్ కుమార్ అత్యధికంగా పది పాయింట్లు సాధించాడు. అమిత్ 5, సుమిత్ 4, ఆశిశ్ 4, మహేందర్ సింగ్ 4, రోహిత్ 3, బంటి 2 పాయింట్స్ సాధించారు. 

ఇక పాట్నా విషయానికి వస్తే 18 రైడ్ పాయింట్స్ తో బెంగళూరు కంటే మెరుగ్గా నిలియినా డిఫెండర్స్ వైఫల్యం వల్ల ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. బుల్స్ జట్టు 15 ట్యాకిల్స్ పాయింట్స్ సాధిస్తే పైరేట్స్ మాత్రం 12 మాత్రమే చేసింది. ఇక బెంగళూరు జట్టును ఆలౌట్ చేయడం ద్వారా మరో 2 పాయింట్లు అందుకుని మొత్తం 32 పాయింట్స్ సాధించి 2 పాయింట్స్ తేడాతో ఓటమిపాలయ్యింది. 

 పాట్నా ఆటగాళ్లలో ప్రదీప్ నర్వాల్ అత్యధికంగా 10 పాయింట్లతో  ఆకట్టుకున్నాడు. మిగతావారిలో మహ్మద్ ఇస్మాయిల్ 9, నీరజ్ 3, వికాస్ 3, హది 3, లీ జంగ్ కున్ 1, జయదీప్ 1 పాయింట్స్ సాధించారు.