క్రికెట్‌తో పాటు దేశవాళీ క్రీడ అయిన కబడ్డీకి ప్రాచుర్యం కల్పించాలనే లక్ష్యంతో ప్రారంభమైన ప్రొ కబడ్డీ లీగ్‌కు మంచి ఆదరణ లభించింది. ఈ క్రమంలో ప్రొ కబడ్డీ లీగ్ 2019 సంబంధించి ఆటగాళ్ల వేలం ముగిసింది.

ముంబైలో మంగళవారం జరిగిన వేలంలో 12 ఫ్రాంచైజీలు కలిపి మొత్తం 200 మంది ఆటగాళ్లను ఎంచుకున్నాయి. వీరిలో 173 మంది భారత ఆటగాళ్లు కాగా, 27 మంది విదేశీయులు ఉన్నారు. వేలం కోసం అన్ని ఫ్రాంచైజీలు కలిపి రూ. 50 కోట్లు ఖర్చుశాయి.

అత్యధిక ధర పలికిన ఆటగాళ్ల విషయానికొస్తే మహీందర్‌ను బెంగళూరు బుల్స్ రూ.80 లక్షలకు తీసుకోగా, మన్‌జీత్‌ను పుణేరీ పల్టన్ రూ.63 లక్షలకు ఎంచుకుంది. ఆల్‌రౌండర్స్ కేటగిరీలో యు ముంబా రూ. 89 లక్షలతో సందీప్ నర్వాల్‌ను ఎంపిక చేసుకుంది. సోమవారం జరిగిన ప్రధాన వేలంలో సిద్ధార్ధ్ దేశాయ్ రూ. 1.45 కోట్లు, నితిన్ తోమర్ రూ.1.20 కోట్లు పలికారు. 

తెలుగు టైటాన్స్ జట్టు ఇదే:

సిద్ధార్ధ్ దేశాయ్
సూరజ్ దేశాయ్
రాకేశ్ గౌడ (రైడర్స్)
విశాల్ భరద్వాజ్
కృష్ణ మదన్
సి.అరుణ్
అబోజర్ మిగాని (డిఫెండర్స్)
అర్మాన్
డ్యూయెట్ జెన్నింగ్స్
ఫర్హద్ రహీమి
శివగణేశ్ రెడ్డి
మనీశ్
ఆకాశ్ చౌదరి
అమిత్ కుమార్ (ఆల్‌రౌండర్లు)