ప్రో కబడ్డి లీగ్ 2019 లో తెలుగు టైటాన్స్ మరో ఘోర పరాజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. కోల్‌కతాలోని నేతాజి ఇండోర్ స్టేడియం వేదికన జరిగిన మ్యాచ్ లో  యూ ముంబా ధాటికి టైటాన్స్ నిలవలేకపోయింది. ముంబై ఆటగాళ్లు సమిష్టిగా రాణించి టైటాన్స్ ను 27 పాయింట్లకే కట్టడిచేయడంతో పాటు 41 పాయింట్లు సాధించారు. ఇలా 14 పాయింట్ల తేడాతో ముంబై ఘన విజయాన్ని అందుకుంది. 

ముంబై జట్టు అన్ని విభాగాల్లోనూ తెలుగు టీంపై పైచేయి సాధించింది. ముంబై  రైడింగ్ లో 18, ట్యాకిల్స్ లో 15, ఆలౌట్ల ద్వారా 6, ఎక్స్‌ట్రాల రూపంలో 2 ఇలా మొత్తం 41 పాయింట్లు సాధించింది. కానీ టైటాన్స్ జట్టు రైడింగ్ లో 15, ట్యాకిల్స్ లో 9, ఆలౌట్ల ద్వారా 2, ఎక్స్‌ట్రాల రూపంలో 1 ఇలా కేవలం 27 పాయింట్ల వద్దే చేతులెత్తేసింది. దీంతో ముంబై 14 పాయింట్ల తేడాతో గెలుపొందింది. 

ముంబై ఆటగాళ్లలో అర్జున్ దేశాయ్ 10, రోహిత్ 7, ఫజల్ 6, సందీప్ 4, సురీందర్ 3, అభిషేక్ 3 పాయింట్లు సాధించారు. టైటాన్స్ తరపున రాకేశ్ 7, సిద్దార్థ్ 4, ఫహద్ 4, విశాల్ 4, అంకిత్ 2, సూరజ్ 1, అబోజర్ 1, అమిత్ 1 పాయింట్ సాధించారు.