ముంబై వేదికన జరుగుతున్న ప్రో కబడ్డి సీజన్ 7 లో జైపూర్ పింక్ పాంథర్స్ అదరగొట్టింది. బెంగాల్ వారియర్స్ తో జరిగిన హోరాహోరీ మ్యాచ్ లో చివరకు జైపూర్ 2 పాయింట్స్ తేడాతో విజయాన్ని అంందుకుంది.  చివరివరకు నువ్వా నేనా అన్నట్లు ఉత్కంఠతో సాగిన మ్యాచ్ లో బెంగాల్ టీం పోరాడి ఓడింది. 

ఈ  మ్యాచ్ లో బాలీవుడ్ జంట అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారాయ్ బచ్చన్ తమ ముద్దుల కూతురు ఆరాధ్యతో కలిసి సందడి చేశారు. మ్యాచ్ జరుగుతున్నంతసేపు వీరు జైపూర్ జట్టుకు మద్దతుగా కెరింతలు కొడుతూ తెగ సందడి చేశారు.

మ్యాచ్ విషయానికి వస్తే ఇరు జట్టు సమఉజ్జీలుగా నిలిచాయి. అయితే పింక్ పాంథర్స్ కి 2 ఆలౌట్,  ఎక్స్‌ట్రా ల రూపంలో  3 పాయింట్లు లభించడంతో విజేతగా నిలవగలిగింది. రైడింగ్,   ట్యాకిల్స్ విషయంలో పాంథర్స్ జట్టు వారియర్ కంటే తక్కువ పాయింట్స్ సాధించింది. 

పింక్ పాంథర్స్ రైడింగ్ లో 12, ట్యాకిల్స్ లో 10,   ఆలౌట్ 2,  ఎక్స్‌ట్రా ల రూపంలో  3 పాయిట్స్ లభించాయి. ఆటగాళ్లలో డిపెండర్ సందీప్ అత్యధికంగా 8 పాయింట్లు సాధించాడు. మిగతావారిలో దీపక్  నివాస్ 6, దీపక్ నర్వాల్ 4, అమిత్ 2, సచిన్ 2 పాయింట్ల సాధించారు. 

బెంగాల్ వారియర్స్ లో ప్రపజన్ 7, బల్దేవ్ 6, మనిందర్ 6 పాయింట్లతో ఆకట్టకోగా ఇస్మాయిల్ 2, రింకు 2, మహ్మద్ 1 పాయింట్ సాధించారు. ఇలా ఆ జట్టు రైడింగ్ లో 13, ట్యాకిల్స్ లో 11 జైపూర్ కంటే ఎక్కువ పాయింట్లు సాధించినా విజయాన్ని మాత్రం అందుకోలేకపోయింది.  ఇలా 27-25 పాయింట్ల తేడాతో బెంగాల్ ఓటమిని చవిచూసింది.