ప్రో కబడ్డి సీజన్ 7లో  హర్యానా స్టీలర్స్ ఘన విజయం సాధించింది. హోంగ్రౌండ్, సొంత ప్రేక్షకకుల ముందు హర్యానా ఆటగాళ్లు చెలరేగి ఆడి తెలుగె టైటాన్స్ ను చిత్తుగా ఓడించింది. హర్యానా ఆటగాళ్ల సమిష్టిగా పోరాడి ఈ విజయాన్ని అందించారు. ఇప్పటికే ప్లేఆఫ్ అవకాశాలను కోల్పోయిన టైటాన్స్ కనీసం గౌరవప్రదంగా అయినా టోర్నీనుండి వైదొలిగేలా కనిపించడం లేదు. 

తెలుగు టైటాన్స్ రైడింగ్ లో 23, ట్యాకిల్స్ లో 8, ఎక్స్‌ట్రాల రూపంలో 1 మొత్తం 32 పాయింట్లు సాధించింది. సిద్దార్థ్ 12, ఫహాద్ 10, రాకేశ్ 4, ఆకాశ్ 3  పాయింట్లతో ఆకట్టుకున్న టైటాన్స్ విజయాన్ని మాత్రం అందుకోలేకపోయింది. 

విజేత హర్యానా సొంత ప్రేక్షకుల మధ్యలో అద్భుతం ప్రదర్శన కనబర్చింది. రైడింగ్ లో 31, ట్యాకిల్స్ లో 12, ఆలౌట్ల ద్వారా 6, ఎక్స్‌ట్రాల రూపంలో 3 మొత్తం 52 పాయింట్లు సాధించిది. వికాస్  13, వినయ్ 8, ప్రశాంత్ 7, రవి 7, సునీల్ 4  పాయింట్లతో హర్యానాకు విజయాన్ని అందించాడు.