ప్రో కబడ్డి లీగ్ సీజన్ 7లో మరో రసవత్తర పోరుకు పాటలిపుత్ర స్పోర్ట్స్ కాంప్లెక్స్ వేదికయ్యింది. బెంగాల్ వారియర్స్- బెంగళూరు బుల్స్ మధ్య చివరివరకు హోరాహోరీగా సాగిన పోరులో చివరకు బుల్స్ దే పూచేయిగా నిలిచింది. ఈ జట్టు స్టార్ రైడర్ నవీన్ కుమార్ నిజమైన బుల్ మాదిరిగా ప్రత్యర్ధి ఆటగాళ్లపై రంకెలేసి ఏకంగా 29 పాయింట్లు సాధించింది. ఇలా సింగిల్ మ్యాచ్ లో ఓ ఆటగాడు ఇన్ని పాయింట్లు సాధించడం చాలా అరుదు. కానీ నవీన్ అలవోకగా ఆ పని చేశాడు. 

బెంగాల్ వారియర్స్ రైడర్స్ కూడా ఏం తక్కువ  తినలేదు. ప్రపంజన్ 12, మణీందర్ సింగ్ 11, ఇస్మాయిల్ 8 పాయింట్లతో ఆకట్టుకున్నారు. అయితే చివరి వరకు నువ్వా నేనా  అన్నట్లుగా సాగిన ఈ మ్యాచ్ లో చివరకు ఒక్క పాయింట్ తేడాతో బెంగళూరుదే పైచేయిగా నిలిచింది.   

బెంగాల్,  బెంగళూరు ఇరు జట్లకు చెందిన రైడర్స్ హోరాహోరీగా పాయింట్లు సాధించారు. ఇలా  బెంగళూరు కేవలం రైడింగ్ లోనే 31 పాయింట్ల సాధించగా బెంగాల్ 29 పాయింట్లతో గట్టి పోటీ నిచ్చింది. ట్యాకిల్స్ లో  బెంగాల్ 7, బెంగళూరు 8 పాయింట్లు మాత్రమే సాధించాయి. ఇలా ఈ మ్యాచ్ మొత్తంలో రైడర్ల హవా  కొనసాగింది. 

ఈ మ్యాచ్  చివరి వరకు ఇరు జట్లు నువ్వా నేనా  అన్నట్లుగా పోరాడాయి. అయితే  చివర్లో బెంగళూరు కేవలం ఒక్క పాయంట్ ఆదిక్యంతో విజేతగా నిలిచింది. ఇలా 42-43  పాయింట్ల తేడాతో బెంగాల్ ఓటమిని చవిచూసింది.